మేడం అనసూయ.. వాటిని వదులుకుని చాలా పెద్ద తప్పు చేశారండి

జబర్దస్త్ యాంకర్ గా దాదాపు దశాబ్ద కాలం పాటు బుల్లి తెర పై సందడి చేసిన యాంకర్ అనసూయ ఈ మధ్య కాలం లో కనిపించడం లేదు.జబర్దస్త్ కామెడీ షో కి గుడ్ బై చెప్పిన తర్వాత అనసూయ వరుసగా సినిమాలు చేస్తానంటూ ప్రకటించింది.

 Anchor Anasuya Lost Chances In Movies Due To Quit Jabardasth Show ,anchor Anasu-TeluguStop.com

మరో వైపు స్టార్ మా ఛానల్ లో వరుసగా షో లు కూడా చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చింది.కానీ జబర్దస్త్ షో మానేసిన తర్వాత ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా లో ఆమె కు సానుభూతి తెలుపుతూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఆ విషయం పక్కన పెడితే ఇటీవల అనసూయ నటించిన సినిమా లు కూడా ప్రేక్షకులను అలరించడం లేదు.

జనాలు అనసూయ ను పట్టించుకోవడం లేదనే ఉద్దేశం తో నిర్మాతలు అనసూయ ను సంప్రదించడం లేదు, బుల్లి తెర పై కనిపించిన సమయం లో అనసూయ కు ఉన్న క్రేజ్ నేపథ్యం లో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తాజాగా సోషల్ మీడియా లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అనసూయ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని.అందుకు కారణము జబర్దస్త్ కార్యక్రమాన్ని వదలడమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ తో అటు ఈటీవీ లో ప్రసారం అయ్యే కార్యక్రమాలన్నింటినీ కూడా వదిలేసిన అనసూయ చాలా పెద్ద తప్పు చేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.సోషల్ మీడియా లో మరియు బాహాటంగా కూడా అనసూయ జబర్దస్త్ మానేయడం అనేది చాలా పెద్ద తప్పు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు అనసూయ మాత్రం ప్రస్తుతం ఫ్యామిలీకి కావలసినంత సమయాన్ని ఇస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారట.అనసూయ బుల్లి తెర కెరీర్ ముగిసినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మంచి సినిమాలను ఎంపిక చేసుకోకుంటే వెండి తెర కెరీర్ కూడా కష్టాల్లో పడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube