ఒకరికోసం ఒకరం లేము... భర్త గురించి షాకింగ్ పోస్ట్ చేసిన అనసూయ?

Anasuya Posted A Shocking Post To Husband Details, Anasuya,Susank,Marriage Day,post Went Viral,Anasuya On First Love Letter,Anasuya With Husband,Anasuya On Marriage Day,Anasuya Post In Insta Viral News,Anasuya Love With Husband

న్యూస్ రిపోర్టర్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ (Anasuya) ప్రస్తుతం బుల్లి తెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించిన అనసూయ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

 Anasuya Posted A Shocking Post To Husband Details, Anasuya,susank,marriage Day,p-TeluguStop.com

ఇక ఈమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.తిలక్ తన భర్త సుశాంక్ (Susank)ఇద్దరు పిల్లలతో కలిసి అనసూయ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

జూన్ 4వ తేదీ అనసూయ పెళ్లి రోజు(Marriage Day) కావడంతో ఈమె తన భర్తతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా అనసూయ ఇంస్టాగ్రామ్ ద్వారా తన భర్తతో ఏర్పడిన పరిచయం ప్రేమ గురించి చెబుతూ ఒక పోస్ట్ రాశారు.నువ్వు నాకు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ ఇంకా గుర్తుంది.2001, జనవరి 23లో న్యూఢిల్లీలోని ఆడిటోరియంలో నాకు లెటర్‌ ఇచ్చావు.ఇప్పటికి నేను ఆ లెటర్ కు రిప్లై ఇవ్వలేదని నాకు తెలుసు.అందుకే ఇప్పుడు ఇస్తున్నాను.డియర్ నిక్కు నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు కృతజ్ఞతలు.నువ్వు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు ఎన్ని అవమానాలు ఎదురైనా మన ప్రేమ దేవాలయం కోసం నువ్వు ఒక పిల్లర్ గా నిలిచావు అంటూ రాసుకోచ్చారు.

ఇన్ని సంవత్సరాలు పాటు నువ్వు నన్ను ఎలా భరించావో నాకు అర్థం కావడం లేదు అలాగే నేను కూడా నిన్ను ఎలా భరించానో తెలియడం లేదు.నేను నా జీవితాంతం చికాకు పెట్టాలనుకునే ఏకైక వ్యక్తి నువ్వే.

నాకు తెలుసు మనిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని మనిద్దరం మూర్ఖులమే.కొన్నిసార్లు ఒకరి కోసం ఒకరు లేకుండా ఎంతో దారుణంగా ప్రవర్తించాము.

మన పెళ్లిని ఇలా డేటింగ్ లా చేసినందుకు నీకు థాంక్స్ పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ అనసూయ తన భర్త గురించి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube