బుల్లితెర యాంకర్ అనసూయ ఒకవైపు టీవీ షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు గుర్తింపు తెచ్చిపెట్టే సినిమాలను ఎంచుకుంటూ వెండితెరపై కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరును తెచ్చిపెట్టడంతో అనసూయ స్టార్ హీరోల సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు.
సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అనసూయ ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా అనసూయ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ తానెక్కడా చూడలేదని అనసూయ వెల్లడించారు.పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ ను చూస్తే తనకు ఒళ్లు పులకరించిపోయిన భావన కలుగుతుందని ఆమె తెలిపారు.
పవన్ తో కలిసి చేసే ఛాన్స్ వస్తే అంతకంటే లక్ ఏమి ఉంటుందని అనసూయ ప్రశ్నించడం గమనార్హం.
అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు అనసూయ చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుండటం గమనార్హం.పుష్ప సినిమాలో అనసూయ సునీల్ భార్యగా నటిస్తుండగా సినిమాను రెండు భాగాలుగా చేయడంతో ఆమె రోల్ బాగా పెరిగిందని సమాచారం.
పుష్ప మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని అనసూయ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో అనసూయ పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఛాన్స్ వస్తే కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశారు.అయితే అనసూయ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.మరి పవన్ కళ్యాణ్ అనసూయకు ఛాన్స్ ఇస్తారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
మరోవైపు అనసూయ సినిమాను, పాత్రను బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.చిన్న సినిమాలకు ఎక్కువమొత్తం పారితోషికం తీసుకుంటున్న అనసూయ పెద్ద సినిమాలకు మాత్రం తక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం.







