Anasuya : భర్త పై ఆసక్తికర పోస్ట్ చేసిన అనసూయ.. ఏకంగా దానితో పోల్చిన రంగమ్మత్త?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు రావడంతో వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

దీంతో బుల్లితెర కార్యక్రమాలకు ఈమె దూరమయ్యారు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇక ఈమెకు షూటింగ్ పనులలో ఏమాత్రం విరామం దొరికిన తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారు.ఇక అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడిపే ఈమె తాజాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్( Susank Bharadwaj ) ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

పోస్ట్ చూసినటువంటి అభిమానులు నీ భర్తను ఇలాంటి దానితో పోల్చడం ఏంటి అనసూయ.పోల్చడానికి మరేదీ లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇంతకీ అనసూయ తన భర్తను ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేశారు ఏంటి అనే విషయానికి వస్తే.ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె పోస్టులను చేస్తూ నాకు ఏ విధమైనటువంటి సహాయం అవసరం లేదని తెలిసినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాను ఇది సరిగ్గా తన భర్తకు సరిపోతుంది అంటూ ఒక చింపాంజీ( Chimpanzee ) ఉన్నటువంటి వీడియోని ఈమె షేర్ చేశారు.ఇలా చింపాంజితో తన భర్తను ఈమె పోల్చుకోవడంతో అభిమానులు నీ భర్తను పోల్చడానికి చింపాంజీ తప్ప మరేలాంటి వీడియోలు దొరకలేదా అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా లో ఆ కామెడీ సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారా..?
Advertisement

తాజా వార్తలు