బూతుమాటపై ఆరతీసిన అనసూయ

పూరి జగన్నాథ్ సినిమాల్లో మాటలు చాలా సూటిగా ఉంటాయి, బలంగా ఉంటాయి అలాగే ద్వందర్థాలు కూడా ఉంటాయి.

ఇక ఆయన కొత్త సినిమా ఇజంలో కూడా అలాంటి డైలాగ్ ఒకటి ఉంది.

ఇజం టీజర్ లో చూసినట్లయితే కళ్యాణ్ రామ్ నీటినుండి "ఐ డక్ యూ, ఐ డక్ హిమ్, ఐ డక్ ఎవ్రీవన్" అనే డైలాగ్ ఒకటి వినబడుతుంది.ఇందులో "డక్" అనే పదాన్నీ ఏ పదానికి బదులుగా వాడారో మనకు తెలియనిది కాదు.

Anasuya Cracks The Meaning Of ‘Duck’ In ISM Dialogue-Anasuya Cracks

తెలుసుకోవడానికో, ఆడియో ఫంక్షన్ ని ఆసక్తికరంగా మార్చడానికో, యాంకర్ అనసూయ నిన్న ఈ డక్ పదానికి అర్థం ఏమిటని మొదట హీరో కళ్యాణ్ రామ్ నే అడిగింది.దానికి కళ్యాణ్ రామ్ "నీటిమీద వెళ్ళే డక్" అని తెలివిగా తప్పించుకున్నాడు.

మళ్ళీ ఇదే ప్రశ్న కామెడియన్ ఆలీని అడిగితే "నేనేం మాట్లాడినా తప్పు అయిపోతోందమ్మ, నాకు తెలిసిన డక్ అంటే తెలుగు భాషలో బాతు, అది కొద్దిగా పెద్దదయితే హంస, నాకెందుకి హింస" అంటూ చమత్కరించేసరికి అక్కడున్నవారంతా కాసేపు నవ్వుకున్నారు.చివరగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అనసూయకి కావాల్సిన సమాధానం దొరికింది.

Advertisement

"డక్ అంటే బాతు అనుకుంటున్నారేమో .అది బూతు అండి" అంటూ పూరి అసలు విషయాన్ని బయటపెట్టేసారు.Anchor Anasuya, double meaning dialogues, i duck u, Ism Audio, Ali And Puri.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు