జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో మనకు ఎన్నో ఆవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి.కొంతమంది సక్సెస్ స్టోరీలు( Success Story ) విన్న సమయంలో మనం ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాము.
అనంతపురం ఏఎస్పీ హనుమంతు( Anantapur ASP Hanumanthu ) తాజాగా ఒక సందర్భంలో మట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చిన్నప్పుడు తాను భిక్షాటన చేశానంటూ హనుమంతు తను అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
రాయలసీమ జిల్లాలను కరువు జిల్లాలు అని అంటారని నేను కూడా రాయలసీమ వాసినేనని ఆయన కామెంట్లు చేశారు.తినడానికి తిండి లేకపోతే చిన్న వయస్సులో నేను అడుక్కోవడానికి వెళ్లేవాడినని హనుమంతు వెల్లడించారు.
అలా బెగ్గింగ్( Begging ) చేసే సమయంలో చదువుకునే పిల్లలను చూసి అన్నం తినడం మానేసి వాళ్లనే చూస్తూ ఉండిపోయానని ఆయన అన్నారు.స్కూల్ కు వెళితే నా దుస్తులు సరిగ్గా లేకపోవడంతో అన్నం కోసం వచ్చానని అనుకున్నారని హనుమంతు వెల్లడించారు.
పగిలిపోయిన పలక ఇచ్చి అమ్మ స్కూల్ కు( School ) పంపించగా పిల్లలు నన్ను పక్కన కూర్చోబెట్టుకోలేదని ఆయన పేర్కొన్నారు.టీచర్ గట్టిగా మందలించి పిల్లలతో స్నేహం చేసేలా చేశాడని టీచర్ మంచి బట్టలు ఇచ్చాడని ఆయన వెల్లడించారు.అన్నం కోసం పెళ్లిళ్లు జరిగే చోటుకు వెళ్లి పని చేశానని హనుమంతు పేర్కొన్నారు.సమాధి తవ్వడానికి కూడా వెళ్లానని ఆయన కామెంట్లు చేశారు.
ఒకప్పుడు మా అమ్మను తిట్టిన వాళ్లు మా అమ్మకు చేతులెత్తి నమస్కరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.నేను మల్లెపూలు కూడా అమ్మానని హనుమంతు వెల్లడించారు.హనుమంతు కన్నీటి కష్టాలు ఆయన ఎదిగిన తీరు గురించి తెలిసి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ఎన్ని పనులు చేసినా చదువును మాత్రం వదులుకోలేదని ఆయన అన్నారు.హనుమంతు( ASP Hanumanthu ) సక్సెస్ సాధించిన తీరు స్పూర్తిధాయకమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.