ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) గురించి భారత ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
నిత్యం తన వ్యాపార లావాదేవీల విషయంలో తనమునకలవుతూ ఆ మధ్యలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఈ దిగ్గజానికే చెల్లింది.
ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఫోటోలు, వీడియోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వుంటారు.ఈ క్రమంలోనే మరో అద్భుతమైన వీడియోతో మనముందుకొచ్చారు ఆనంద్ మహీంద్రా.
ఓ అత్యాధునిక బ్రిడజ్ నిర్మాణం( Bridge construction ) గురించి కేంద్ర మంత్రి నితిన్ గట్కరి( Union Minister Nitin Gatkari ) దృష్టికి తీసుకెళుతు ఇటువంటి అద్భుతాన్ని మన భారత్ లో కూడా చేయగలమా? అంటూ ప్రశ్నించడం ఇపుడు ప్రత్యేకతని సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే, నెదర్లాండ్స్( Netherlands ) లోని రివర్స్ బ్రిడ్జిగా పేరొందిన వెలువెమీర్ అక్వెడక్ట్ బ్రిడ్జ్( Veluwemere Aqueduct Bridge ) వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్వట్టర్ వేదికగా షేర్ చేయడం విశేషం.ఇక్కడ వీడియోని గమనిస్తే, నదిపై నిర్మించిన రహదారిపై వాహనాలు స్పీడ్ గా దూసుకుపోతున్నాయి.అలా వాహనాలు దూసుకుపోతుండగా మధ్యలో రహదారి కట్ అయి ఉంటుంది.
అయినా సరే వాహనాలు నీటిలోనుండి వెళుతున్నట్టు కనిపిస్తుంటుంది.మధ్యలో అవి కాస్త కనిపించకుండా తిరిగి రహదారిపై కనిపిస్తాయి.
అయితే ఇదెలా సాధ్యం అని మనకు అనిపిస్తుంది.అంతేకాకుండా అదొక మేజిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడ ఆర్కిటెక్టులను మనం మెచ్చుకోక తప్పదు.ఎందుకంటే నదిని రోడ్డుని అనుకొని ఓ భారీ కెనాల్ నిర్మించడం వలన ఇది సాధ్యపడిందని సరిగ్గా చూస్తే మనకు అర్ధం అవుతుంది.ఇది ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభ.
వాహనాలు వెళ్లటానికి వీలుగా అదే సమయంలో బోట్లు వెళ్లటానికి చక్కటి సౌకర్యంగా ఉండే ఈ నిర్మాణం నిజంగా అద్భుతంగా నిర్మించడం జరిగింది.నీటిపై బోట్లు వెళ్లడానికి రహదారి మధ్యలో ఈ డిజైన్ చేశారు.
అక్కడ రహదారి నీటి కింది భాగం నుంచి వెళుతుంది.వాహనాలు వేగంగా వెళుతూ, మధ్యలో కాసేపు కనిపించకుండా తిరిగి మరోవైపు ప్రత్యక్షమవుతున్నట్టు కనిపించటం భలే గమ్మత్తుగా ఉంది కాదు.
కాగా ఈ నిర్మాణం చూసిన ఆనంద్ మహీంద్రా భారత్ లోనూ ఇలాంటి నిర్మాణాలు చేయగలమా? అంటూ ఆనంద్ మహీంద్రా కేంద్ర మంత్రి గడ్కరీని ప్రశ్నించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy