యువకులను మాత్రమే డేటింగ్ చేసే వృద్ధురాలు.. కారణం తెలిస్తే షాకే..

ప్రేమకు వయసు, చర్మం రంగు, కులం, జాతి, మతం అనేవి ఏవీ అడ్డు రావు.

వయసులో చాలా తేడా ఉన్నాం కొంతమంది ప్రేమలో పడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.తాజాగా ఒక వృద్ధురాలు చిన్న వయసు వారితో ప్రేమ సంబంధం పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.ఆ మహిళ వయసు 63 ఏళ్లు.

పేరు సిండీ గల్లప్( Cindy Gallup ).న్యూయార్క్‌లో ఒక ప్రకటన సంస్థను నడిపేది.తాను ఎప్పుడూ చాలా నిజాయితీగా ఉంటానని, ముఖ్యంగా యువకులతో ప్రేమ సంబంధం పెట్టుకున్నప్పుడు తన వయసు గురించి ఎప్పుడూ నిజం చెప్తానని ఆమె తెలిపింది.

సిండీ తాను రిలేషన్‌షిప్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టనని చెబుతోంది.తన వ్యాపారానికి ఒక ఆన్‌లైన్ డేటింగ్ బ్రాండ్‌ను ప్రచారం చేయవలసి వచ్చినప్పుడు ఆమెకు యువకులపై ఆకర్షణ ఏర్పడింది.

న్యూయార్క్‌లో ( New York )తన అనుభవం గురించి ఆలోచిస్తూ "నేను ఒంటరిగా ఉన్నాను, వ్యాపారం కోసం నేను ఇది చేయాలి, ప్రయత్నించడంలో తప్పు ఏముంది? అని అనుకున్నదట.సిండీని సంప్రదించిన వారిలో సుమారు 7 శాతం మంది ఆమెకన్నా చిన్న వయసు వారు.

ఈ విషయం ఆమె ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచిందట."వావ్, నేను ఇలాంటి విషయాన్ని ఎప్పుడూ ఊహించలేదు, కానీ ఇది నాకు బాగా నచ్చింది!" అని ఆమె అనుకున్నది.

సిండీ మేక్ లవ్ నాట్ పోర్న్( Make Love Not Porn ) అనే సంస్థకు సీఈఓ.ఆమె చిన్న వయసు వారితో ప్రేమ సంబంధం పెట్టుకోవడానికి ఒక నిర్దిష్ట కారణం ఉందట.యువకులతో ప్రేమ సంబంధం పెట్టుకోవడానికి కారణం సెక్స్ అని ఆమె చెప్పింది.

ఆమె మరోసారి, "నేను ఎక్కువ స్టామినా, త్వరగా రికవర్ అయ్యే వారితో శృంగార సంబంధం పెట్టుకోవడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నా.నా వయసు వారితో సెక్స్ లో పాల్గొనడం వల్ల చాలా అసంతృప్తి, ఇబ్బందులు ఎదురవుతాయని కూడా నేను గుర్తించాను" అని చెప్పింది.

సిండీ తన జీవితాన్ని ఆనందిస్తూ, సెక్స్ గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహిస్తోంది.కానీ ఆమె చిన్న వయసు వారితో అఫైర్లు పెట్టుకున్నందుకు చాలా మంది ఆమెను విమర్శిస్తున్నారు.తన ఇంటర్వ్యూ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసినప్పుడు, ఆమెను క్రీప్ అని అనేక మంది అవమానించారు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

చాలా మంది ఆమెను కౌగర్ అని అంటూ ఎద్దేవా చేసినప్పటికీ, ఆమె తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూనే ఉంది.సెక్స్ గురించి ప్రజల్లో ఉన్న భావన మార్చడానికి ట్రై చేస్తోంది.

తాజా వార్తలు