కుటుంబ భారాన్ని మోస్తున్న 11 ఏళ్ల కుర్రాడు

తండ్రి మరణంతో 11 ఏళ్ల బాలుడు కుటుంబ భారాన్ని మోయసాగాడు.ఆటపాటలతో సాగాల్సిన బాల్యం సైకిల్ పై ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు.

ఇంటికి ఆసరాగా, తల్లికి అండగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.అనంతపురం జిల్లా గుత్తిలోని గాంధీనగర్ కాలనీ కి చెందిన వెంకటేశ్, సుజాత దంపతులకు యశోధ, వెంకటలక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్ ఐదుగురు పిల్లలు.

భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటున్నారు.ఆరేళ్ల కిందట భర్త వెంకటేశ్ మరణించడంతో అప్పటినుంచి భార్య సుజాత కూలి పనులు చేస్తే ఇళ్లు గడిచేది.

అలా ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు కూడా చేసింది.పెళ్లిళ్లు చేయడంతో అప్పులు పెరిగాయి.

Advertisement

ఆర్థిక కష్టాలు పెరగడంతో పూట గడవడం కష్టంగా మారింది.ఇంటి పరిస్థితిని అర్థం చేసుకున్న 11 ఏళ్ల సుదర్శన్ తల్లికి అండగా నిలిచాడు.

గత మూడేళ్ల నుంచి తల్లితో పాటు టిఫిన్ సెంటర్ ను ప్రారంభించి చదువుకునే వాడు.ఇందులోనూ కష్టంగా మారడంతో కూరగాయలు, ఆకుకూరలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

సైకిల్ ను తీసుకుని కూరగాయలను ఊరంతా అమ్ముతూ విక్రయించసాగాడు.అలా రోజూ రూ.150-200 వరకు సంపాందించేవాడు.అయితే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది లేదని.

స్కూల్ ప్రారంభమైతే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని సుదర్శన్ వాపోతున్నాడు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు