ఏపీలో ఇప్పుడు ఘర్షణ వాతావరణ రాజకీయాలు నడుస్తున్నాయి.ఇప్పటికే వైసీపీ వర్సెస్ టీడీపీ అంటూ ఏకంగా దాడులు చేసుకునే దాకా వచ్చాయి రాజకీయాలు.
అయితే దీనికి కౌంటర్ వేయాలని చంద్రబాబు నాయుడు చాలానే ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే వైసీపీని టార్గెట్ చేస్తూ ఏకంగా ఢిల్లీ దాకా వెళ్లారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కూడా కలిసి ఏకంగా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ రిక్వెస్ట్ కూడ చేయడం పెను సంచలనంగా మారింది.అయితే ఢిల్లీలో ఏది చేయాలన్నా నరేంద్రమోడీ, అమిత్ షాలతోనే అవుతుందని చంద్రబాబుకు కూడా తెలిసిన విషయమే.
మరి వారిని కలవకుండా ఉంటారా అందుకే వారిని కూడా కలిసేందుకు బాగానే ప్రయత్నించారు.కానీ వారు మాత్రం ఆయన్ను కనికరించలేదు.వారి అపాయింట్ మెంట్ కోసం ఎంతలా ట్రై చేసినా చివరకు నిరాశే మిగిలింది.ఇక దీని తర్వాత చంద్రబాబు తమ ఎంపీలను అమిత్ షా వద్దకు పంపించి మరీ తనకు అపాయింట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయించారు.
దీనిపై అమిత్ షా కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది.కాగా ఇప్పుడు అమిత్ షా నవంబరు 14న తిరుపతికి వస్తున్నారు.
ఆయన ఇక్కడకు వచ్చిన తర్వాత దక్షిణ ప్రాంత కౌన్సిల్ మీటింగ్‌కు అటెండ్ అవుతారు.

అయితే ఈ మీటింగ్ తర్వాత తిరుపతిలోనే రాత్కరి ఆయన షా బస చేయనున్నారు.ఆ తర్వాత ఉదయం తిరుపతి శ్రీవారిని దర్శించుకుంటారని సమాచారం.ఈ క్రమంలోనే కొందరికి ఆయన అపాయింట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీంతో చంద్రబాబు నాయుడుకు కూడా అవకాశం ఇస్తారని ఆయనతో భీటే అవుతారని టీడీపీ తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు.ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు గానీ ఇంతగా ప్రయత్నిస్తున్నందుకు అయినా చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇస్తే గనక అది టీడీపీకి కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.
.