తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసే విషయంలో ఆ పార్టీ జాతీయ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు.
తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా మునుగోడులో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతూ ఉండడం తో, ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే కు రాజీనామా చేసి బిజెపి లో చేరడం తో ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి.దీంతో ఈ నియోజకవర్గంలో గెలవాలనే పట్టుదలతో బిజెపి ఉంది.ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి , బిజెపి అగ్ర నేత అమిత్ షా నేడు మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
ఈ సందర్భంగా బిజెపిని గెలిపించాల్సిన ఆవశ్యకతతో పాటు , టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పైన ఆయన విమర్శలు చేసే అవకాశం ఉంది.ఈ సభకు భారీగా జన సమీకరణను బిజెపి చేపట్టింది.
ఇదిలా ఉంటే మునుగోడు సభ తరువాత అమిత్ షా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారని, అక్కడ రామోజీరావుతో ప్రత్యేకంగా కాబోతున్నట్లు సమాచారం.అయితే రామోజీరావు తో ఏ విషయం పై అమిత్ షా భేటీ అవుతారు అనే విషయంలో తెలంగాణ బిజెపి నాయకులకు సరైన సమాచారం లేదు .అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి బలపడేందుకు అవసరమైన మీడియా సహకారం అందించాల్సిందిగా కోరెందుకే అమిత్ షా ఫిలిం సిటీకి వెళ్తున్నట్లుగా కొంతమంది బిజెపి నాయకులు చెబుతున్నారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ రామోజీరావు సఖ్యతగా మెలుగుతూ ఉంటున్న క్రమంలో, అమిత్ షా రామోజీరావు మద్దతు కోరడం ద్వారా రానున్న రోజుల్లో బిజెపికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం.అయితే అమిత్ షా రామోజీరావు ప్రత్యేకంగా సమావేశం అవుతారా ఆ సమావేశంలో తెలంగాణ బిజెపికి చెందిన నాయకులు కూడా ఉంటారా అనే విషయంలో సరైన క్లారిటీ లేదు.కాకపోతే తమకు అందువచ్చిన ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదల కేంద్ర బిజెపి పెద్దలలోను, తెలంగాణ బిజెపి నాయకులలోను బలంగా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈరోజు మునుగోడు అమిత్ షా సభలో కీలక నాయకులు చాలామంది చేరబోతున్నారు.వేరే వారి పేర్లు కొన్ని బయటకు లీకైనా, మరి కొంతమంది పేర్ల విషయం లో గోప్యత పాటిస్తున్నారు.







