అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు ఎంతో మంది అమెరికా వాసులకి కోపాన్ని తెప్పిస్తున్నాయి.ముఖ్యంగా విదేశాల నుంచీ అమెరికా వస్తున్న వారిపై ప్రవేశ పెట్టిన వీసా నిభంధనల విషయంలో ఎన్నారైలు ట్రంప్ పై గుర్రుగా ఉన్నారు మరో పక్క ఇదే విషయంలో అమెరికాలోని దిగ్గజ టెకీ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయంపై నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ట్రంప్ పై అమెరికాలోని వర్సిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

విదేశీ విద్యార్థుల కోసం చాలా కఠినమైన చట్టాలను అమెరికా ప్రభుత్వం తయారు చేయడంతో అక్కడి అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని 65 వర్సిటీలు ఆవేదన వ్యక్తం చేశాయి.ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్.మిట్.
లు మరిన్ని యూనివర్సిటీలు అయిన కార్నెల్.యేల్.
ప్రిన్స్‌టన్ లాంటి వర్సిటీలు కూడా ట్రంప్ వీసా విధానాన్ని తప్పుపట్టాయి.కొత్త నిభంధనల ప్రకారం.
విదేశీ విద్యార్థులు ఎవరైనా తమ చదువు కాలం ముగిసినా లేదా వీసా తేదీ ముగిసినా సరే ఇకమీదట ఆ దేశంలో ఉండడానికి వీలు లేదు.

దాంతో విద్యార్ధులు అమెరికా వచ్చి చదువుకోవాలి అంటేనే వెనకడుగు వేస్తున్నారు.ట్రంప్ చర్యలతో ఎపడిన ఈ పద్ధతి అమెరికా విద్యా వ్యవస్థను దెబ్బతీస్తుందని ఈ యూనివర్సిటీలు అన్నీ గగ్గోలు పెడుతున్నాయి.మరి యూనివర్సిటీల విషయంలో నిభందనలు సడలించే అవకాశం ఏమన్నా చేపడుతారేమో వేచి చూడాలి అంటున్నారు నిపుణులు.







