అగ్రరాజ్యం అమెరికా “యోగా” కి ఫిదా...!!!!

అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో ఘనంగా నిర్వహించ బోతున్నారు.ఇప్పటికే భారీగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో మంది అమెరికన్లు పోటీ పడుతున్నారు.ఇప్పటి వరకూ దాదాపు 2500 మంది తమ పేర్లని నమోదు చేయించుకున్నారు.

ఐక్యరాజ్య సమితిలో ఇండియా 2014 డిసెంబర్‌ 11న యోగా ప్రతిపాదన చేయగా జూన్ జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించింది.

అమెరికాలోని వాషింగ్టన్ లో ఈ నెల 16న నిర్వహించే యోగాకు స్థానిక పౌరుల నుంచీ విశేష స్పందన వస్తోందని, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం వరుసగా ఇది ఐదో సారని అమెరికాలోని భారత రాయభారి హర్షవర్ధన్‌ శ్రుంగల తెలిపారు.ఇండియన్‌ ఎంబసి , మరో 20 సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయని ఆయన తెలిపారు.ఈ సారి జరగబోయే యోగా కార్యక్రమానికి మరో ప్రత్యేకత ఉందని ఆయన తెలిపారు.

Advertisement

అదేంటంటే, జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా విజిటేరియన్‌ ఫుడ్ ఫెస్టివల్ కి కూడా భారీగానే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ యోగా కార్యక్రమానికి అమెరికాలోని అన్ని దేశాల రాయబారులు, ఐరాస సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారని తెలిపారు.

తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు