పానీపూరి ఎంజాయ్ చేస్తున్న అమెరికన్ పీపుల్.. వీడియో చూస్తే..

పానీపూరి( Panipuri ) గురించి తెలియని వారు ఉండరు.రోడ్డు పక్కన దొరికే ఈ ఇండియన్ స్నాటేస్ట్ అదిరిపోతుంది.

కొంచెం పులుపు, కొంచెం స్వీట్‌నెస్ మిళితమైన ఈ క్రంచీ వాటర్ బాల్స్ ఎన్ని తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.పానీపూరిని చిన్నతనంలో ఎంతో ఇష్టపడి క్ తిన్న వారికి ఇది ఒక ఎమోషన్.

ఇటీవల అమెరికాలో కూడా పానీపూరి ట్రెండ్ అయ్యింది.మిన్నెసోటాలోని మినియాపోలిస్ అనే ఊర్లో ఉన్న కర్రీ కార్నర్ అనే ఇండియన్ రెస్టారెంట్ బయట, స్థానికులు పానీపూరి ఫస్ట్ టైమ్ టేస్ట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

దీనికి లక్షల కొద్దీ వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.

American People Enjoying Panipuri.. If You See The Vide, Minneapolis, Curry Corn
Advertisement
American People Enjoying Panipuri.. If You See The Vide, Minneapolis, Curry Corn

ఆ వీడియోలో మినియాపోలిస్‌( Minneapolis ) లోని స్థానికులు పానీపూరి టేస్ట్ చేసి స్పీచ్‌లెస్ అయ్యారు, అంటే మాటలు తడబడ్డారు.అంత రుచిగా వారికి అది అనిపించింది.ఈ వీడియోను రెస్టారెంట్ వాళ్ళు షేర్ చేస్తూ, "భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్ట్రీట్ ఫుడ్‌ను మినియాపోలిస్ రోడ్లపైకి తీసుకొచ్చాం.

" అని చెప్పుకున్నారు.ఈ వీడియో ఎంత పాపులర్ అయ్యిందంటే దీనికి ప్రపంచవ్యాప్తంగా తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోతో పానీపూరి మన సంస్కృతిని దాటి, ఇతర దేశాల వాళ్లకు కూడా నచ్చింది అనే విషయం స్పష్టం అయ్యింది.

American People Enjoying Panipuri.. If You See The Vide, Minneapolis, Curry Corn

అమెరికాలోని చికాగో( Chicago ) నగరంలో పానీపూరి టేస్ట్ చేసిన ఒక వ్యక్తి, దాని రుచితో ఎంతో బాగుందని అన్నాడు.మరొకరు, "ఒకటి రెండు పానీపూరే తింటే సరిపోదు.కనీసం మూడు, నాలుగు తినాలి" అని చెప్పి, పానీపూరి మీద తన ఇష్టాన్ని చూపించారు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

భారతదేశంలో పానీపూరి ప్లేట్‌లో సాధారణంగా ఐదు, ఆరు పూరీలు ఉంటాయని కొందరు కామెంట్ చేశారు.చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, పానీపూరి కేవలం తినే పదార్ధం మాత్రమే కాదు, అది ఒక ఫీలింగ్, కొందరికి అది ఎమోషన్ లాంటిది కూడా.

Advertisement

నిజమైన పానీపూరి ప్రేమికులు ఒక్కటే తింటారా? కనీసం ఎనిమిది తినాలి అని మరొకరు కామెంట్ చేశారు.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు