జనసేన గాజు గ్లాసు గుర్తుపై అంబటి రాంబాబు సెటైర్..!!

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు( Janasena Glass Symbol ) అని అందరికీ తెలుసు.2019 ఎన్నికలలో ఈ గుర్తు తోనే పోటీ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో 137 స్థానాలు తెలంగాణలో ఏడు పార్లమెంటు స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు.

అయితే ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించింది.దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటిస్తూ.

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు కోల్పోయినట్లు ప్రకటించింది.అంతేకాదు ఈ గుర్తును ఫ్రీ సింబల్ చేస్తున్నట్లు కూడా అప్పట్లో  ఎన్నికల సంఘం ప్రకటన చేయడం జరిగింది.

అయితే తాజాగా మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల సంఘానికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

ఇదిలా ఉంటే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( YCP Minister Ambati Rambabu ) ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు."మళ్లీ గ్లాసు  గుర్తు ఎందుకు సైకిలే తీసుకుంటే పోలా".

అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party )తో కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించడంతో.

దాన్ని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఈ రీతిగా స్పందించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?
Advertisement

తాజా వార్తలు