గ‌ర్భిణీలు ఉల్లి కాడ‌లు తింటే లాభమా? న‌ష్ట‌మా? ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

ఉల్లి కాడ‌లు.వీటినే స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా పిలుస్తుంటారు.

వంట‌ల్లో విరి విరిగా ఉప‌యోగించే ఉల్లి కాడ‌లు ప్ర‌త్యేక‌మైన రుచిని క‌లిగి ఉంటాయి.

ఉల్లి గ‌డ్డ‌ల మాదిరిగానే ఉల్లి కాడ‌లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ధ‌ర విష‌యానికి వ‌స్తే.ఉల్లి కాడల ధ‌రే త‌క్కువగా ఉంటుంది.

అయిన‌ప్ప‌టికీ పోష‌కాలు మాత్రం మెండుగా ఉంటాయి.పొటాషియం, క్రోమియం, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియం, స‌ల్ఫ‌ర్‌, విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

Advertisement
Amazing Health Benefits Of Spring Onions For Pregnant! Health, Benefits Of Sprin

అందుకే ఉల్లి కాడ‌లు ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.ఎన్నో జ‌బ్బుల‌నూ నివారిస్తాయి.

అయితే బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్‌ను అందించే ఉల్లి కాడ‌ల‌ను గ‌ర్భిణీ స్త్రీలు తీసుకోవ‌చ్చా.? అస‌లు గ‌ర్భిణీలు ఉల్లి కాడ‌లు తీసుకుంటే లాభామా.? న‌ష్ట‌మా.? అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు.ఈ క్ర‌మంలోనే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్త్రీలు ఉల్లి కాడ‌లు తీసుకోవ‌డానికి వెన‌క‌డుగు వేస్తుంటారు.

కానీ, ఉల్లి కాడ‌లు గ‌ర్భిణీల‌కు ఎంతో మంచి చేస్తాయి.

Amazing Health Benefits Of Spring Onions For Pregnant Health, Benefits Of Sprin

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఉల్లి కాడ‌లు తీసుకుంటే గ‌నుక‌.వారి కడుపులో బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్ పుష్క‌లంగా ఉంటుంది.ఉల్లి కాడ‌ల్లో ఉండే పోష‌క విలువ‌లు క‌డుపులోని బిడ్డ ఎదుగు ద‌ల‌కు ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అలాగే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఆటిజం వంటి సమస్యలూ రాకుండా ఉంటాయి.ఇక కొంద‌రు మ‌హిళ‌లు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో అధిక ర‌క్త పోటుతో తెగ ఇబ్బంది ప‌డ‌తారు.

Advertisement

అయితే త‌ర‌చూ ఉల్లి కాడ‌ల‌ను త‌గిన మోతాదులో తీసుకుంటే ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.అంతేకాదు, గ‌ర్భిణీలు ఉల్లి కాడ‌ల‌ను తీసుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం దూరం అవుతుంది.

ఎసిడిటీ, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు సైతం రాకుండా ఉంటాయి.అయితే ఆరోగ్యానికి మంచివి క‌దా అని ఉల్లి కాడ‌ల‌ను ప‌రిమితికి మించి మాత్రం తీసుకోరాదు.

తాజా వార్తలు