రోస్ట్డ్ గార్లిక్ రుచిగా ఉండ‌ట‌మే కాదు..ఆరోగ్యానికీ మ‌స్తు బెనిఫిట్స్‌!

వెల్లుల్లి(గార్లిక్‌). దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

వెల్లుల్లిలో విటమిన్ బి, విట‌మిస్ సి, మాంగనీస్, కాల్షియం, కాపర్, సెలీనియం, పొటాషియం, జింక్‌, ఐర‌న్‌, ఫోలిక్ యాసిడ్‌, శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా గార్లిక్ ఎంతో మేలు చేస్తుంది.

అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అయితే ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండ‌టం వ‌ల్ల చాలా మంది వెల్లుల్లిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

కానీ, గార్లిక్‌ను రోస్ట్ చేస్తే రుచి చాలా బాగుతుంది.పైగా రోస్ట్ చేసిన గార్లిక్‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మాస్తు బెనిఫిట్స్ ల‌భిస్తాయి.

Advertisement
Amazing Health Benefits Of Roasted Garlic Details! Health, Benefits Of Roasted G

మ‌రి గార్లిక్‌ను ఎలా రోస్ట్ చేయాలి.? అసులు రోస్ట్ చేసిన గార్లిక్‌ను తిన‌డం వ‌ల్ల ఏయే బెనిఫిట్స్‌ను పొందొచ్చు.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక పూర్తి వెల్లులి పాయ‌ను తీసుకుని పైభాగాన్ని క‌ట్ చేసి లైట్‌గా పొట్టు తీసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్‌పై ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల ఆవ నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిని వేసి రోస్ట్ చేసుకోవాలి.

Amazing Health Benefits Of Roasted Garlic Details Health, Benefits Of Roasted G

వెల్లిల్లి బాగా రోస్ట్ అయ్యాక‌.చివ‌ర్లో కొద్దిగా పింక్ సాల్ట్‌ను చ‌ల్లుకుంటే స‌రి పోతుంది.వారానికి మూడు లేదా నాలుగు సార్లు వెల్లుల్లిని ఇలా రోస్ట్ చేసి తీసుకుంటే ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి పోయి గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

Amazing Health Benefits Of Roasted Garlic Details Health, Benefits Of Roasted G

అలాగే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు రోస్ట్డ్ గార్లిక్ తీసుకుంటే.ఆయా స‌మ‌స్య‌లు ఇట్టే దూరం అవుతాయి.శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అలాగే రోస్ట్డ్ గార్లిక్‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి అద్భుతంగా పెరుగుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

Advertisement

ర‌క్త పోటు స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.ఇక లివ‌ర్ స‌మ‌స్య‌లు ఉన్న వారికి సైతం రోస్ట్డ్ గార్లిక్ చాలా మంచి చేస్తుంది.

తాజా వార్తలు