జామాకులేగా అని తీసిపారేయకండి.. అవి అందించే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో జామకాయలు ఒకటి.చౌక ధరకే లభించిన జామకాయలు చాలా రుచికరంగా ఉంటాయి.

మరియు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అయితే జామకాయలే కాదు జామ ఆకులు( Guava Leaves ) కూడా మన ఆరోగ్యానికి తోడ్పడతాయి.

సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు జామాకులేగా అని తీసి పారేస్తుంటారు.కానీ అవి అందించే ప్రయోజనాలు తెలిస్తే క‌చ్చితంగా ఆశ్చర్యపోతారు.

జామ ఆకుల్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అందువ‌ల్ల జామ ఆకులు ఇమ్యూనిటీ బూస్ట‌ర్ గా( Immunity Booster ) ప‌ని చేస్తాయి.

Advertisement

సీజ‌న‌ల్ వ్యాధుల‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి.జామ ఆకుల్లో విటమిన్ ఎ ఉంటుంది.

ఇది దృష్టి లోపాల‌కు చెక్ పెడుతుంది.కంటి చూపును( Eye Sight ) మెరుగుప‌రుస్తుంది.

అలాగే త‌ర‌చూ ఒత్తిడికి గుర‌య్యే వారికి జామ ఆకులు ఒక వ‌రమనే చెప్పుకోవ‌చ్చు.జామ ఆకుల‌తో టీ( Guava Leaves Tea ) త‌యారు చేసుకుని తీసుకుంటే.

అందులో ఉండే యాంటీ యాంగ్జయిటీ గుణాలు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి.మైండ్‌ను ప్ర‌శాంతంగా మారుస్తాయి.

ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందట.. ట్విస్ట్ ఏంటంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, శుక్రవారం 2024

జామ ఆకుల‌ను నేరుగా తిన‌డం లేదా టీ రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.జామ ఆకులు ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.అలాగే మ‌ధుమేహం( Diabetes ) ఉన్న వారు రోజుకు రెండు జామ ఆకులు తింటే చాలా మేలు జ‌రుగుతుంది.

Advertisement

జామ ఆకులు గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించగలవు మరియు భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి.

మ‌హిళ‌లు నెల‌స‌రి స‌మ‌యంలో జామాకుల టీ తాగితే బాడీ పెయిన్స్ నుండి రిలీఫ్ పొందుతారు.అంతేకాదండోయ్‌.జామ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

ఇవి డయేరియాను నయం చేయగలవు మరియు కడుపు తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.జామ ఆకుల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల పంటి నొప్పి మరియు చిగుళ్ల సమస్యలు సైతం దూరం అవుతాయి.

తాజా వార్తలు