అమ్మ బాబోయ్.. రోజుకు 2 ఎండు ఖర్జూరాలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?

ఎండు ఖర్జూరాలు( Dried dates ) వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

చక్కటి రుచితో పాటు ఎన్నో విలువైన పోషకాలు ఎండు ఖర్జూరాల్లో నిండి ఉంటాయి.

అయితే వీటిని ఎవరు పెద్దగా పట్టించుకోరు.ఎక్కువ శాతం మంది మామూలు ఖర్జూరాలను తినేందుకే మక్కువ చూపుతుంటారు.

కానీ ఎండు ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.నిజానికి రోజుకు రెండు ఎండు ఖర్జూరాలు తింటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఎముకల బలహీనతకు గురవుతున్నారు.ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎండు ఖర్జూరాలు గ్రేట్ గా సహాయపడతాయి.

Advertisement
Amazing Health Benefits Of Dried Dates! Dried Dates, Dried Dates Health Benefits

రోజుకు రెండు ఎండు ఖర్జూరాలు తింటే.వీటిలో ఉండే క్యాల్షియం, కాపర్, మెగ్నీషియం ఎముకలను దృఢంగా మారుస్తాయి.

అలాగే ఇటీవల రోజుల్లో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మంది రక్తహీనత సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.

Amazing Health Benefits Of Dried Dates Dried Dates, Dried Dates Health Benefits

ఈ క్ర‌మంలోనే రక్తహీనత ( Anemia )నుంచి బయటపడేందుకు మందులు వాడుతున్నారు.అయితే ఎండు ఖర్జూరాలు రక్తహీనతను నివారించేందుకు అద్భుతంగా సహాయపడతాయి.ఎండు ఖర్జూరాల్లో రక్తహీనతను తరిమికొట్టే ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

అందువల్ల రోజుకు రెండు ఖర్జూరాలను తీసుకుంటే ర‌క్త‌హీన‌త‌కు దూరంగా ఉండొచ్చు.అంతేకాదండోయ్‌.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

రోజుకు రెండు ఎండు ఖర్జూరాలు తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా ( Heart healthy )మారుతుంది.

Amazing Health Benefits Of Dried Dates Dried Dates, Dried Dates Health Benefits
Advertisement

దంపతుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.సంతాన సమస్యలు ఉంటే దూరం అవుతాయి.మెదడు మునుపటి కంటే చురుగ్గా పనిచేస్తుంది.

జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

ఇన్ని ప్రయోజనాలు అందించే ఎండు ఖర్జూరాలను త‌ప్ప‌కుండా డైట్ లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు