బ్లాక్ క్యారెట్స్ గురించి ఈ విష‌యాలు తెలిస్తే తిన‌కుండా ఉండ‌లేరు!

క్యారెట్స్‌ అంటే ట‌క్క‌న అంద‌రికీ నారింజ రంగులో నిగ‌నిగ‌లాడుతూ ఉండేవే క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూ ఉంటాయి.

అయితే క్యారెట్స్‌లోనే బ్లాక్ క‌ల‌ర్‌లో ఉండే క్యారెట్స్‌ కూడా ఉంటాయి.

న‌లుపు రంగులో ఉండే క్యారెట్స్ తియ్య‌గానే కాకుండా కాస్త కారంగానూ ఉంటాయి.పోష‌కాల విషయానికి వ‌స్తే.

కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, జింక్‌, విట‌మిన్ ఇ, విటమిన్ కె, విమ‌ట‌న్ ఎ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లావిన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు క్యారెట్స్‌లో నిండి ఉంటాయి.

Health, Benefits Of Black Carrot, Black Carrot, Latest News, Health Tips, Good

అందుకే ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను బ్లాక్ క్యారెట్స్ ద్వారా పొందొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బ్లాక్ క్యారెట్స్‌ను తిన‌డం వ‌ల్ల ఏయే హెల్త్ బెనిఫిట్స్ ల‌భిస్తాయో చూసేయండి.ఇటీవ‌ల రోజుల్లో అల్జీమర్స్ వ్యాధికి గుర‌వుతున్న వారి సంఖ్య భారీగా పెరిగుతోంది.

Advertisement
Health, Benefits Of Black Carrot, Black Carrot, Latest News, Health Tips, Good

వ‌య‌సు పైబ‌డిన వారే కాదు.చిన్న వ‌య‌సు వారు సైతం అల్జీమ‌ర్స్ బారిన ప‌డుతున్నారు.

అయితే రెగ్యుల‌ర్‌గా బ్లాక్ క్యారెట్స్‌ను తీసుకుంటే గ‌నుక‌.అందులో ఉండే ప‌లు శ‌క్తి వంత‌మైన పోష‌కాలు అల్జీమర్స్ వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గించి మెద‌డు ప‌ని తీరును మెరుగ్గా మారుస్తాయి.

త‌ద్వారా ఆలోచ‌నా శ‌క్తి, జ్ఞాప‌క శ‌క్తి రెండూ పెరుగుతాయి.శ‌రీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరిగే కొద్ది క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం పెరుగుతుంది.

అయితే బ్లాక్ క్యారెట్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే.అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడిక‌ల్స్‌ను అంతం చేసి క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అలాగే బ్లాక్ క్యారెట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి అద్భుతంగా పెరుగుతుంది.త‌ద్వారా వివిధ ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Health, Benefits Of Black Carrot, Black Carrot, Latest News, Health Tips, Good
Advertisement

అంతే కాదు, బ్లాక్ క్యారెట్స్‌ను త‌ర‌చూ తింటుంటే కంటి చూపు పెరుగుతుంది.శ‌రీరీంలో కొవ్వు క‌రిగే ప్ర‌క్రియ వేగ వంత‌మై.బ‌రువు త‌గ్గుతారు.

ర‌క్త హీన‌త స‌మ‌స్య‌కు గురి కాకుండా ఉంటారు.ఎముక‌లు, దంతాలు బ‌లంగా మార‌తాయి.

మ‌రియు నీర‌సం, అల‌స‌ట‌, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌కు ఎల్ల‌ప్పుడూ దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు