వైరల్: అద్భుతంగా స్కేటింగ్‌ చేస్తోన్న కుక్క.. నెట్టింట్లో వైరల్!

జంతువులు, మనుషులు చేసిన పనులు చేస్తే చాలా క్యూట్ గా అనిపిస్తుంది.ముఖ్యంగా పెంపుడు జంతువులు అయినటువంటి పిల్లి, కుక్క ఏది చేసినా మనకి నచ్చుతుంది.

అందువలన అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి.ఒక్కోసారి అవి చేసే విన్యాసాలు చూస్తే మనకి ఒకింత ఆశ్చర్యం, నవ్వు ఒకేసారి కలుగుతుంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది.ఇలాంటి వీడియోలు మనకు అరుదుగా కనబడుతుంటాయి.

ఇక సోషల్ మీడియా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుండటంతో అలాంటి లెక్కలేని వీడియోలు మనకు కనువిందు చేస్తున్నాయి.ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూసుకుంటే, ఓ కుక్క పిల్ల ప్రొఫెషనల్ రోలర్ స్కేటర్‌లా స్కేటింగ్‌ చేస్తూ చూపరులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Advertisement

రోలర్‌ వెనకాల పరుగుత్తుతూ చాలా తమాషాగా అది స్కేటింగ్‌ చేయడం మనం గమనించవచ్చు.ఈ పెంపుడు కుక్కపిల్ల తమ యజమానులు స్కెటింగ్ చేసినపుడు చూసి నేర్చుకుందని చెబుతున్నారు.

దాంతో వారు దానికి స్కెటింగ్ చేయడాన్ని ఎంకరేజ్ చేయడంతో అది ఇపుడు ఓ స్పోర్ట్స్ మెన్ లాగా ఇరగదీస్తోంది.ఇక ఆ కుక్కపిల్ల చేసే తమాషా స్కేటింగ్‌కి అక్కడున్న వారందరు నవ్వడం మనం వీడియోలో గమనించవచ్చు.

దానికి సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సదరు వీడియోని ఒక నెటిజన్‌ ట్విటర్‌లో షేర్ చేసి ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.దాంతో అది కాస్త వైరల్ అయింది.ఇప్పటివరకు ఈ వీడియోని 6 లక్షల మందికి పైగా చూశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అలాగే 30000కు పైగా లైక్‌లు వచ్చాయి.స్కేటింగ్‌ చేస్తున్న కుక్కపిల్లని చూసి నెటిజన్లు తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయండి.కాగా ఇలాంటి వీడియోలు రోజుకి కొన్ని వేలకు పైగా అప్లోడ్ అవుతున్నాయని ఓ సర్వే చెబుతోంది.

తాజా వార్తలు