చ‌ర్మానికి వ‌రం ట‌ర్మ‌రిక్ ఆయిల్‌.. వారానికి 2 సార్లు వాడినా మ‌స్తు బెనిఫిట్స్‌!

మన భారతీయ సంస్కృతిలో పసుపుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఏ శుభకార్యం జరిగిన కచ్చితంగా పసుపు ఉండాల్సిందే.

అలాగే వంటల్లో విరివిరిగా పసుపును వాడుతుంటారు.ఆయుర్వేద వైద్యంలో పసుపు ఉపయోగిస్తారు.

అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, జుట్టు సంరక్షణకు కూడా పసుపు తోడ్పడుతుంది.ముఖ్యంగా పసుపుతో చేసిన నూనె చర్మానికి వరం అని చెప్పుకోవచ్చు.

టర్మరిక్ ఆయిల్( Turmeric Oil ) ను వారానికి రెండు సార్లు వాడినా కూడా మస్తు స్కిన్ కేర్( Skin Care ) బెనిఫిట్స్ పొందవచ్చు.ఈ నేపథ్యంలోనే టర్మరిక్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా రెండు అంగుళాల పచ్చి పసుపు కొమ్ము తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న కప్పు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి.అలాగే పసుపు కొమ్ము తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఆయిల్ ను చిన్న మంటపై దాదాపు 6 నుంచి 8 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.

టర్మరిక్ ఆయిల్‌ స్కిన్ విషయంలో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది.నైట్ నిద్రించే ముందు ఈ టర్మరిక్ ఆయిల్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా ఐదారు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేసినా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు.ట‌ర్మ‌రిక్ అయిల్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడ‌తాయి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి.ట‌ర్మ‌రిక్ ఆయిల్ ను వాడ‌టం వ‌ల్ల కొద్ది రోజుల్లోనే క్లియ‌ర్ స్కిన్‌ను పొందుతారు.

Advertisement

అలాగే ట‌ర్మ‌రిక్ ఆయిల్ లో కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్లు( Vitamins ) పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మానికి మంచి పోషణ అందిస్తాయి.

స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండ‌టానికి తోడ్ప‌డ‌తాయి.ఇక చర్మాన్ని ప్రకాశవంతం చేసే గుణాలు ట‌ర్మ‌రిక్ ఆయిల్ లో ఉన్నాయి.

పైగా డార్క్ స్పాట్స్, హైపర్‌పిగ్మెంటేషన్ మరియు మొటిమల తాలూకు మచ్చలను పోగొట్టడంలో కూడా ట‌ర్మ‌రిక్ ఆయిల్ ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.

తాజా వార్తలు