బచ్చలికూర-అవ‌కాడో క‌లిపి ఇలా తీసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్ మీవే!

బ‌చ్చ‌లికూర‌.అవ‌కాడో..

ఈ రెండూ విడి విడిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అనేక జ‌బ్బుల‌నూ నివారిస్తాయి.అయితే అపార‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉండే బ‌చ్చ‌లికూర‌, అవ‌కాడోల‌ను క‌లిసి తీసుకుని మ‌రిన్ని ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి బచ్చలికూర, అవ‌కాడోల‌ను క‌లిపి ఎలా తీసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.? అస‌లు ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? వంటి విష‌యాల‌పై ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Spinach With Avocado, Spinach Leaves, Avocado, Latest News, Health Tips, Good
Advertisement
Spinach With Avocado, Spinach Leaves, Avocado, Latest News, Health Tips, Good

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో క‌డిగి శుభ్రం చేసుకున్న బ‌చ్చ‌లికూర ఒక క‌ప్పు, అవ‌కాడో ముక్క‌లు అర క‌ప్పు వేసుకుని వాట‌ర్ సాయంతో జ్యూసీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం, చిటికెడు న‌ల్ల ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇక ఈ జ్యూస్‌ను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో సేవించాలి.

ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డే వారు ఈ సూప‌ర్ జ్యూస్‌ను సేవిస్తే శ‌రీరానికి ఐర‌న్ పుష్క‌లంగా అంది ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.

దాంతో ర‌క్త హీన‌త ప‌రార్ అవుతుంది.అలాగే బచ్చలికూర, అవ‌కాడోల‌తో త‌యారు చేసిన జ్యూస్ తాగ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.

Spinach With Avocado, Spinach Leaves, Avocado, Latest News, Health Tips, Good
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కిష్కింధపురి ' టీజర్ ఎలా ఉందంటే..?

అంతే కాదు.బచ్చలికూర, అవ‌కాడోల‌ను క‌లిపి పైన చెప్పిన విధంగా తీసుకుంటే షుగర్ లెవల్స్‌ రెగ్యులేట్ అవుతాయి.మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డి. జ్ఞాప‌క శ‌క్తి  రెట్టింపు అవుతుంది.

Advertisement

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.కంటి చూపు పెరుగుతుంది.

మ‌రియు శ‌రీర బ‌రువు సైతం అదుపు త‌ప్ప‌కుండా ఉంటుంది.

తాజా వార్తలు