ఒత్తిడిని చిత్తు చేసే లెమ‌న్ ఆయిల్‌..ఎలాగంటే?

ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక కార‌ణం చేత త‌ర‌చూ ఒత్తిడికి లోన‌వుతున్నారు.

ఒత్తిడికి గురికావ‌డం తేలికే కానీ, దాని నుంచి బ‌య‌ట ప‌డ‌టం మాత్రం ఎంతో క‌ష్టం.

అయిన‌ప్ప‌టికీ ఒత్తిడిని నివారించుకోవాలి.లేకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టు ముట్టేస్తాయి.

అయితే ఒత్తిడిని చిత్తు చేయ‌డంలో లెమ‌న్ ఆయిల్(నిమ్మ నూనె) అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.సుగంధ తైలాల్లో ఒక‌టైన నిమ్మ నూనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉంటాయి.

అందుకే నిమ్మ నూనె ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళ‌న‌, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు నిమ్మ నూనె యొక్క వాస‌న‌ను పీల్చాలి.

Advertisement
Amazing Benefits Of Lemon Oil! Benefits Of Lemon Oil, Lemon Oil, Latest News, Sk

ఇలా చేస్తే గ‌నుక ఆయా స‌మ‌స్య ఇట్టే ప‌రార్ అవుతాయి.మ‌రియు మ‌న‌సు, మెద‌డు రెండూ ప్ర‌శాంతంగా మార‌తాయి.

Amazing Benefits Of Lemon Oil Benefits Of Lemon Oil, Lemon Oil, Latest News, Sk

అలాగే మొండి మొటిమ‌ల‌ను, వాటి తాలూకు మ‌చ్చ‌ల‌ను పోగొట్ట‌డంలోనూ నిమ్మ నూనె ఉప‌యోగ‌ప‌డుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ తేనె, నాలుగు చుక్క‌లు నిమ్మ నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై అప్లై చేసి ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటిలో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజూ చేస్తే గ‌నుక మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.పొడి చ‌ర్మంతో బాధ ప‌డే వారికి కూడా లెమ‌న్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది.

స్నానం చేయ‌డానికి గంట ముందు రెండు స్పూన్ బాదం ఆయిల్‌కి, పావు స్పూన్ లెమ‌న్ ఆయిల్‌ను క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొఖానికి, మెడ‌కు అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి.ఇలా చేస్తే పొడి చ‌ర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు