కెప్టెన్ కావాలనే బలమైన కోరికతో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు అమర్ దీప్( Amardeep ).కెప్టెన్ అవ్వడానికి అన్నీ విధాలుగా అర్హత ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు ఆయన.
ప్రారంభం లో ఫౌల్ గేమ్స్ బాగా ఆడినప్పటికీ, తన తప్పుని తెలుసుకొని ఆట తీరు మొత్తాన్ని మార్చుకొని రోజు రోజుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతూ వచ్చాడు.అందరితో మంచి ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, అదే సమయం లో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, టాస్కులు కూడా పోటీ పడుతూ ఆడాడు.
కానీ హౌస్ లో అమర్ అంటే మొదటి వారం నుండి అసూయ తో రగిలిపోతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శివాజీ అనే చెప్పాలి.శివాజీ( Shivaji ) కి సొంత కొడుకు వయస్సు ఉంటుంది అమర్ కి.అలాంటి వ్యక్తి మీద ఇంత కుళ్ళు ఎందుకు అనేది ఎవరికీ అర్థం కానీ ప్రశ్న.అమర్ వెనుక చేరి ఇన్ని రోజులు శివాజీ మాట్లాడిన తప్పుడు మాటలను అన్నిటిని కలిపితే రెండు మూడు సినిమాలు అవుతాయి.

టాస్కులు లేని సమయం లో ఖాళీగా కూర్చున్నప్పుడు శివాజీ( Shivaji ) చేసే పని అమర్ మీద ఏడుస్తూ ఉండడం.ఇప్పటికీ కూడా అమర్ శివాజీ కి ఎంతో గౌరవం ఇస్తాడు.కానీ శివాజీ మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా అమర్ దీప్ ని అవమానిస్తూనే వచ్చాడు.ఈ విషయం లో గత వారం నాగార్జున( Nagarjuna ) అమర్ దీప్ కి చాలా క్లాస్ పీకుతాడు.
ఈ వారం మారుతాడు ఏమో అని అందరూ అనుకున్నారు.కానీ ఈ వారం జరిగిన ఫన్నీ టాస్కులలో కూడా అమర్ దీప్ ని కించపరిచే విధంగా మాట్లాడుతూ వచ్చాడు.
ఇది చూసిన తర్వాత ఇక ఈ మనిషి మారడు అనే అభిప్రాయానికి వచ్చారు నెటిజెన్స్.ఇదంతా పక్కన పెడితే గత వారం కెప్టెన్సీ టాస్కులో కావాలని టార్గెట్ చేసి ఓడించినందుకు అమర్ దీప్ ఎంతలా బాదపడ్డాడో అందరూ చూసారు.
ఆ ఎపిసోడ్ ని చూసి ఏడవని మనిషి అంటూ లేరు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

ఈ వారం అమర్ కెప్టెన్ అయ్యే విషయం హౌస్ మేట్స్ చేతిలో ఉంటే, కచ్చితంగా అందరూ కలిసి అమర్ దీప్ ని కెప్టెన్ చేస్తారని అనుకున్నారు.దాదాపుగా అందరూ సపోర్ట్ చేసారు కానీ, శివాజీ మాత్రం చెయ్యలేదు.ఎంత ఏడుస్తూ బ్రతిమిలాడినా కూడా అతను అర్జున్( Arjun ) కి సపోర్ట్ చేస్తూ అమర్ దీప్ ఫోటో ని కాల్చేశాడు.
అర్జున్ భార్య కి మరోసారి కెప్టెన్ ని చేస్తా అని మాట ఇచ్చాను, అందుకే నా సపోర్ట్ అతనికే అంటూ చెప్పుకొచ్చాడు.అమర్ దీప్ ఎంత బ్రతిమిలాడినా కూడా శివాజీ కనికరించలేదు.
నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు అంటూ తన మనసులో ఉన్న కుళ్ళుని మొత్తం బయటపెట్టేసాడు.ఇక్కడ శివాజీ అమర్ కి అన్యాయం చేసాడు అని అందరూ అనుకోవచ్చు.
కానీ ఈ ఒక్క ఎపిసోడ్ తో అమర్ ని హీరోమీ చేసి టాప్ 1 కి ఫిక్స్ చేసాడు.