శివ కార్తికేయన్ అమరన్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి స్ట్రీమింగ్ కానుందా?

తమిళ హీరో శివ కార్తికేయన్,( Siva Karthikeyan ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన తాజా చిత్రం అమరన్.

( Amaran ) ఇటీవల విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టించింది.ఇకపోతే ఇప్పటికే థియేటర్లో ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.

Amaran Movie Is Ready To Streaming On Netflix, Amaran, Amaran Movie, Netflix, To

దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి( OTT ) విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి.అభిమానుల ఎదురుచూపులకు పులిస్టాప్ పెడుతూ ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్( Netflix ) అధికారికంగా ప్రకటించింది.

డిసెంబర్‌ 5 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడిస్తూ ఒక పోస్టర్‌ ని కూడా విడుదల చేసింది.

Amaran Movie Is Ready To Streaming On Netflix, Amaran, Amaran Movie, Netflix, To
Advertisement
Amaran Movie Is Ready To Streaming On Netflix, Amaran, Amaran Movie, Netflix, To

2014లో జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్‌ జీవిత కథతో రూపొందిన ఈ చిత్రానికి రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు.ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకుగాను ప్రస్తుతం మూవీ మేకర్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగా తాజాగా ఆర్మీ ఆఫీసర్లు హీరో శివ కార్తికేయన్ సత్కరించిన విషయం కూడా తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు