ముద్దుగా ఉందని ఆ జంతువు వద్దకు వెళ్తే గాండ్రించి ఉమ్మేసింది.. వీడియో వైరల్!

సాధారణంగా ప్రజలు కొత్త జంతువులను చూసేందుకు జూలకు, వైల్డ్ లైఫ్( Wild Life ) రిజర్వులకు వెళుతుంటారు.అయితే వారు ఒక్కసారి జంతువులకు దగ్గరగా వెళ్లి వాటిని డిస్టర్బ్ చేస్తుంటారు.

 Alpaca Spits On Woman Viral Video,viral Video, Alpaca Spitting, Viral News, Wom-TeluguStop.com

ఈ క్రమంలో అవి దాడి చేయడమో, లేదంటే భయపడి పారిపోవడమో చేస్తుంటాయి.అందుకే వీటికి దగ్గరగా వెళ్లకుండా దూరం నుంచి చూసేసి ఎంజాయ్ చేయాలి.

అలా కాదని దగ్గరికి వెళ్తే సమస్యలు తప్పవు.అయితే తాజాగా ఒక యువతి ఒక జంతువు ప్రవర్తన గురించి ఏం తెలుసుకోకుండా దాని ముందుకు వెళ్ళింది.

ఆ జంతువు ఆమె ముఖంపై గాండ్రించి ఉమ్మేసింది.దాంతో షాక్ కావడం ఆ యువతి వంతయ్యింది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.దీన్ని చూసి నెటిజన్లు( Netizens ) నవ్వుకుంటున్నారు.మరికొందరు అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక యువతి కనిపిస్తుంది.ఆమె ముందు చాలా అల్పాకాలు ఉన్నాయి.అల్పాకా అనేది లామాకు సంబంధించిన పెంపుడు జంతువు.

ఇది దక్షిణ అమెరికాలోని అండీస్ పర్వతాలకు ( Andes Mountains ) చెందినది.ఈ జంతువు ఉన్ని చాలా సాఫ్ట్‌గా, లగ్జరీస్‌గా ఉంటది.

వీటిని మాంసం, పాల కోసం ఉపయోగిస్తారు.అయితే వీటికి ఉమ్మేసే ఒక అలవాటు ఉంది.

అల్పాకాస్ ఎవరైనా బెదిరించినా లేదా చికాకు పెట్టిన వారిపై ఉమ్మి వేస్తాయి.ఆ ఉమ్ములో కడుపు నుంచి సరిగా జీర్ణం కాని ఆహారంతో పాటు లాలాజలం( Saliva ) ఉంటుంది.ఇది దుర్వాసన, అసహ్యకరమైన అనుభూతిని కలిగిస్తుంది.అయితే అవి భయపడినప్పుడు ఇలా చేస్తాయని తెలియక ఆ యువతి వాటి ముందుకు వెళ్ళింది.ఇంతలోనే వాటిలోని ఒకటి భయపడి ఆమె ముఖంపై ఉమ్మి వేసింది.దాంతో ఆ యువతి చాలా ఫీల్ అయిపోయింది.

అంతేకాదు, ఆ దుర్వాసన భరించలేక చాలా ఇబ్బంది పడింది.

ఈ వీడియోను ‘taninmisphenomen’ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పంచుకుంది దీన్ని చూసి చాలామంది నవ్వుతున్నారు.

అతి చేస్తే ఇలాగే అవుతుందని వాటి గురించి తెలుసుకోకుండా దగ్గరికి వెళ్లడం యువతి తప్పే అని ఇంకొందరు అంటున్నారు.మీరు కూడా ఈ వీడియోని వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube