టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.గతంలో కందిరీగ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కథను చూస్తుంటే గతంలో వచ్చిన కందిరీగ చిత్రానికి డిట్టో ఉన్నట్లు తెలుస్తోంది.ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, వారి మధ్య నడిచే కన్ఫ్యూజన్ ప్రేమకథ లాంటి అంశాలు కందిరీగ చిత్రాన్ని గుర్తుకు చేస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే రామ్ పోతినేని పాత్రలో బెల్లంకొండ బాబు, హన్సిక-అక్ష పాత్రల్లో నభా నటేష్-అను ఇమ్మాన్యుయెల్ కనిపిస్తున్నారట.మొత్తానికి ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఖచ్చితంగా కందిరీగ సీక్వెల్ చూస్తున్నట్లే ఫీల్ అవుతారని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న అల్లుడు అదుర్స్ చిత్రానికి ఇదే టైటిల్‌ను కొనసాగిస్తారా లేక కందిరీగ-2 అనే టైటిల్‌ను పెడతారా అనేది చూడాలి.ఏదేమైనా ఈ సినిమాకు కందిరీగ చిత్రంతో పోలికలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా టైటిల్‌ను మార్చే అవకాశం ఎక్కువగా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తుంది.ఈ సినిమాను వీలైనంత త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.







