'అల్లు'కున్న మెగా బంధం.. మీరు ఎలా పోతే ఏంటి.. మేమంతా ఒకటే!

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒక్కటి కాదు వేరు వేరు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ ప్రచారాన్ని నిజం చేసేలా కొన్ని పరిస్థితులు ఉండడంతో అల్లు ఫ్యాన్స్ అని మెగా ఫ్యాన్స్ అని రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన విషయం విదితమే.

అయితే మీరు మీరు ఎలా కొట్టుకున్న మాకు సంబంధం లేదు అంటూ తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే అని నిరూపించింది.తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా అల్లు స్టూడియోస్ ను ఘనంగా ప్రారంభం చేసారు.

అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొన్నారు.అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

చిరంజీవి చేతుల మీదుగా ఈ స్టూడియో గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది.ఇక ఈ స్టూడియోను ప్రారంభించి చిరు అల్లు ఫ్యామిలీని అభినందించారు.

Advertisement

అల్లు రామలింగయ్య గారు వేసిన బయటలో ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా ఆయన మనవళ్లు కూడా ఇదే రంగంలో రాణిస్తున్నారు.

ఇక ఈ స్టూడియో లాభాపేక్ష కోసం ఏర్పాటు చేయలేదన లాభాపేక్ష కంటే కూడా ఒక స్టేటస్ సింబల్.ఒక గుర్తింపు.ఈ తరమే కాదు రాబోయే తరాలు కూడా ఆయనను అందరు తలచుకునేందుకు అల్లు బ్రాండ్ ను నిలబెట్టడం కోసం దీనిని నిర్మించారని కూడా తెలిపారు.

ఇలా ఈ ఈవెంట్ లో అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ ఎలా ఉంటుందో వారి మధ్య బంధం ఎలా ఉంటుందో చూపించారు.అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మీద చూపించిన అభిమానం చూస్తుంటే.

మీరు మీరు కొట్టుకు చావండి.మేమంతా ఒకటే అని వీరు ఇరు కుటుంబాలు మరోసారి నిరూపించినట్టు అనిపించింది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ అలా వాదించు కోవడం ఆపేయడం మంచిది అని మరికొంత మంది హితబోధ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు