ఇద్దరు ఇండస్ట్రీ హిట్‌ కొట్టినా కోత తప్పడం లేదట

అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో మరియు సుకుమార్‌ ‘రంగస్థలం’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన విషయం తెల్సిందే.

ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఇద్దరి కాంబోలో మూవీ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుకుమార్‌ ప్లాన్‌ చేశాడు.బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తామంటూ ముందే మైత్రి వారు హామీ ఇచ్చారు.

ఆహా ఓహో అన్నట్లుగా సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసిన సుకుమార్‌కు కరోనా షాక్‌ ఇచ్చింది.పాన్‌ ఇండియా మూవీగా రూపొందించాలనుకున్న పుష్ప సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్‌ కంటే దాదాపుగా 30 శాతం తగ్గించినట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ పారితోషికం తగ్గించుకోగా సుకుమార్‌ తన పారితోషికం తగ్గించుకున్నా కూడా బడ్జెట్‌ విషయంలో మాత్రం ఇంకా రాజీ పడాల్సి వస్తుందని టాక్‌ వినిపిస్తుంది.రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు సినిమాల బిజినెస్‌ అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు.

Advertisement
Latest Update Sukumar And Allu Arjun Pushpa About Movie Budjet, Allu Arjun, Suku

అందుకే బడ్జెట్‌లో కోత తప్పలేదని పుష్ప యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

Latest Update Sukumar And Allu Arjun Pushpa About Movie Budjet, Allu Arjun, Suku

సినిమా ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించి దాదాపుగా సగం షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది.కాని ఇంకా షూటింగ్‌ మొదలు కాని కారణంగా చాలా నష్టం జరుగుతోంది.ఇప్పటికే పెట్టిన ఖర్చు వృదా అయిపోతుంది.

ఇలాంటి సమయంలో సినిమాను అదే బడ్జెట్‌తో ముందుకు తీసుకు వెళ్తే చాలా నష్టం తప్పదని, కాస్త బడ్జెట్‌ తగ్గిస్తే సినిమాకు లాభాలు తక్కువ వచ్చినా నిర్మాతలు మరియు బయ్యర్లు సేఫ్‌ అవ్వొచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు