దేవర కథ బన్నీ వదులుకున్న కథ ఒకటేనా.. కొరటాల శివ పూర్తి క్లారిటీ ఇదే!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )హీరోగా నటించిన తాజా చిత్రం దేవర( Devara ).

ఈ సినిమా ఈనెల 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మూవీ మేకర్స్ బిజీ బిజీగా ఉన్నారు.ఇకపోతే దర్శకుడు కొరటాల శివ( Koratala Shiva ) ఆచార్య సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఆచార్య విడుదలకు ముందే కొరటాల శివ తో అల్లు అర్జున్ మూవీ పై అనౌన్సమెంట్ వచ్చింది.కానీ ఆచార్య రిజల్ట్ తర్వాత కొరటాల శివ, అల్లు అర్జున్( Allu Arjun ) మూవీ ఆగిపోయింది.

Allu Arjun Story Has Nothing To Do With Devara Story, Allu Arjun, Devara , Devar

ఆ తర్వాత కొరటాలకు ఎన్టీఆర్ భరోసా ఇవ్వడంతో దేవర రెండు పార్టులుగా పట్టాలెక్కింది.అప్పటి నుంచి కొరటాల శివ అల్లు అర్జున్ కు చెప్పిన కథతోనే ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసాడనే ప్రచారం జోరుగా జరిగింది.అల్లు అర్జున్, కొరటాల కాంబో అనౌన్సమెంట్ వచ్చినప్పుడు ఒక పోస్టర్ వదిలారు.

Advertisement
Allu Arjun Story Has Nothing To Do With Devara Story, Allu Arjun, Devara , Devar

అది కూడా దేవర మాదిరి సముద్రపు అలల నడుమ ఉండడంతో దేవర కథ, అల్లు అర్జున్ కి చెప్పిన కథే ఒకటే అనుకుంటున్నారు.అయితే ఈ విషయం గురించి చాలాసార్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ఇదే విషయం గురించి తాజాగా దేవర సినిమా ప్రమోషన్స్ లో స్పందించారు దర్శకుడు కొరటాల శివ.

Allu Arjun Story Has Nothing To Do With Devara Story, Allu Arjun, Devara , Devar

తాజాగా హైదరాబాదులో నిర్వహించిన మీడియా మీట్ లో కొరటాల శివ మాట్లాడుతూ.అల్లు అర్జున్ కు చెప్పిన కథ వేరు, దేవర కథ వేరు అని తెలిపారు.అంతేకాదు ఆచార్య తర్వాత తనకు చిరంజీవి గారికి మద్యన మంచి సంబంధాలే ఉన్నాయి.

మా మధ్యన ఎలాంటి క్లాషెస్ లెవు అని రూమర్స్ కి చెక్ పెట్టేశారు.ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు