పుష్ప కు కేజీఎఫ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దన్న బన్నీ ఫ్యాన్స్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

డిసెంబర్‌ లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేస్తున్నాడు.ఇక ఈ సినిమా ను మొన్నటి వరకు హిందీలో విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.

కొన్ని కారణాల వల్ల మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను హిందీలో విడుదల చేయలేక పోతున్నట్లుగా జరిగిన ప్రచారం అభిమానులకు కాస్త ఆవేదన కలిగించింది.ఇప్పుడు అభిమానులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసేలా అల్లు అర్జున్‌ పుష్ప సినిమా ను వచ్చే నెలలో హిందీ లో కూడా విడుదల చేయబోతున్నారు.

ప్రముఖ హిందీ సినిమా ల డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిల్మ్స్ వారు ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను దక్కించుకున్నారు.ఈ సినిమా ను అక్కడ భారీగా విడుదల చేయబోతున్నారు.పుష్ప తో బన్నీ మొదటి సారి బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు.

Advertisement

పుష్ప సినిమా తో బన్నీ ఎలా అయితే బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడో.కేజీఎఫ్‌ తో కూడా యశ్‌ కన్నడ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన విషయం తెల్సిందే.

కన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ ను బాలీవుడ్‌ లో ఏఏ ఫిల్మ్స్‌ వారు డిస్ట్రిబ్యూట్‌ చేశారు.ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే.

బాహుబలి 2 కూడా ఏఏ ఫిల్మ్స్ వారు డిస్ట్రిబ్యూట్‌ చేయడం జరిగింది.ఇలా ఏఏ ఫిల్మ్స్ లో డిస్ట్రిబ్యూట్‌ అయిన సినిమా లు అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.ఈ సెంటిమెంట్‌ ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు