టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ.
ఈ సినిమా ఈసారి అంతకుమించి అనే విధంగా పుష్ప 2 ( Pushpa 2 )ఉండబోతుందని తెలుస్తోంది.ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కు హిందీ ఆడియెన్స్ లో చాలా ఫాలోయింగ్ పెరిగింది.వీరాభిమానులు ఏర్పడ్డారు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన ఇండస్ట్రీలో రావడంతో పాటు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారట.అలా ఎంతో మంది జీవితాలను మార్చారట ఐకాన్ స్టార్.మరి అల్లు అర్జున్ మార్చిన ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.యంగ్ హీరో శ్రీ విష్ణు ( Sri Vishnu )మొదట ఒక సినిమాలో నటించిన తర్వాత ఎటువంటి సినిమాలు నటించాలా అని ఆలోచిస్తున్న సమయంలో అల్లు అర్జున్ శ్రీ విష్ణు కి ఫోన్ చేసి ఎలాంటి సినిమాలు నటించాలి.

ఎలాంటి కలెక్షన్లు వస్తాయి అన్న విషయాలు చెప్పారట.అలా అల్లు అర్జున్ చెప్పిన మాటలు శ్రీ విష్ణు కి చాలా బాగా ఉపయోగపడ్డాయి.ఎందుకు నిదర్శనమే ప్రస్తుతం శ్రీ విష్ణు బిజీ బిజీగా ఉండడం.అలాగే హనుమాన్ సినిమా నిర్మాత సంస్థ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో కష్టాలు భరించలేక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని అనుకున్నారట.
ఆ సమయంలో అల్లు అర్జున్ ధైర్యం చెప్పి అతనికి అండగా నిలిచారట.అలా అతను ఒకప్పుడు తెలుగు సీరియల్స్ లో మ్యూజిక్ కంపజjచేయగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాగే రెబల్ శ్రీను( Rebel Srinu ) కి సిగరెట్ అలవాటు ఉండేదట.ఒకసారి అల్లు అర్జున్ అతను సిగరెట్ తాగుతూ ఉండడం చూసి ఇండస్ట్రీలో మీరు చాలామందికి ఆదర్శ దాయగం ఇలాంటి పనులు చేయకూడదని చెప్పారట.