సాధారణంగా స్టార్ హీరోల పిల్లలను సినిమా ల్లో చూపించరు.గతంలో కృష్ణ తో పాటు ఒకరు ఇద్దరు హీరోలు తమ పిల్లలను సినిమా ల్లో చూపించారు.
కానీ ప్రస్తుత జనరేషన్ స్టార్ హీరోలు మాత్రం కనీసం తమ పిల్లలను సోషల్ మీడియాలో కూడా ఎక్స్ పోజ్ అవ్వకుండా చూసుకుంటున్నారు.అయితే మహేష్ బాబు( mahesh babu ).అల్లు అర్జున్ లు మాత్రం తమ కూతుర్ల విషయం లో ఆ నిబంధన పక్కన పెట్టారు.ఇద్దరు కూడా తమ పిల్లల యొక్క వీడియో లు ఫోటోలు షేర్ చేస్తున్నారు.
అప్పుడే వారి కూతుర్ల పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్స్ ను స్వయంగా క్రియేట్ చేయడం జరిగింది.

మహేష్ బాబు కూతురు సితార ఇప్పటి వరకు సినిమా ల్లో కనిపించలేదు.కానీ అల్లు అర్జున్( Allu arjun ) కూతురు అల్లు అర్హ ( Allu arha )మాత్రం అప్పుడే సినిమా ల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది.ఆకట్టుకునే అందం తో పాటు ఈ చిన్నారి యొక్క ఫేస్ లో తెలియని క్యూట్ నెస్ ఇంకా ఆకర్షణ ఉంటుంది.
అందుకే తమ సినిమా లో అంటే తమ సినిమా లో పాపను చూపించాలని చాలా మంది ఆశ పడుతూ ఉంటారు.ఆ మధ్య శాకుంతలం సినిమా లో అర్హ ను చూపించడం జరిగింది.
ఆ సినిమా లో అర్హ ను చూసిన అంతా కూడా షాక్ అయ్యారు.ముఖ్యంగా అర్హ చెప్పిన డైలాగ్స్ చూసి నిజంగా అర్హ చెప్పిందా అన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు

మొత్తానికి అల్లు అర్హ మోస్ట్ వాంటెడ్ కిడ్ గా మారింది.ప్రస్తుతం అర్హ కొత్త సినిమా ఏర్పాట్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఒక యంగ్ స్టార్ హీరో సినిమా లో కీలక పాత్ర లో అర్హ నటించేందుకు గాను ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
అందుకు గాను అందరు ఆశ్చర్యపోయే స్థాయి లో పారితోషికం అందుకుంటుందట.కొత్త హీరోయిన్ ఒక సినిమా కు తీసుకునే పారితోషికంతో పోల్చితే అర్హ కు వచ్చే పారితోషికం ఎక్కువ అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.