పాపం పుష్ప.. ఫ్లైట్‌ టికెట్స్ ఖర్చులు కూడా రాలేదట

అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఉత్తర భారతం లో ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం తో అంతా నోరు వెళ్ళబెట్టారు.

ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇండియన్ సినీ ప్రేక్షకులు పుష్ప సినిమాకు బ్రహ్మరథం పట్టారు.అందుకే ఈ సినిమా ను విదేశాల్లో విదేశీ భాష ల్లో విడుదల చేయాలని చాలా మంది భావించారు.

విదేశీ భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తే కచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయని మైత్రి మూవీ మేకర్స్ వారికి నమ్మకంగా కొందరు హామీ ఇచ్చారట.అందులో భాగంగానే తాజాగా రష్యా దేశంలో ఈ సినిమాను రష్యన్ లాంగ్వేజ్ లో పుష్ప ను విడుదల చేయడం జరిగింది.

ఒక తెలుగు సినిమా రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల కావడం ఆశ్చర్యంగా ఉంది అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు.ఆ మధ్య వచ్చిన రష్యన్ పుష్ప ట్రైలర్ కి ఫిదా అయ్యారు.

Allu Arjun And Sukumar Pushpa Movie Russian Collections , Allu Arjun , Pushpa,
Advertisement
Allu Arjun And Sukumar Pushpa Movie Russian Collections , Allu Arjun , Pushpa,

దాదాపు పది కోట్ల రూపాయలకు ఖర్చుతో చిత్ర యూనిట్ సభ్యులు అంతా కలిసి రష్యాలో వారం రోజుల పాటు తిరిగి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.తాజాగా సినిమా అక్కడ విడుదలై దారుణమైన డిజాస్టర్ టాక్ దక్కించుకుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఈ సినిమా కు వస్తున్న కలెక్షన్స్ కనీసం చిత్ర యూనిట్ సభ్యులు అక్కడికి వెళ్లేందుకు ఖర్చు చేసిన డబ్బుల మందం కూడా రావటం లేదంటూ ప్రచారం జరుగుతుంది.

అక్కడ కోటి రూపాయల కలెక్షన్స్ వస్తేనే గొప్ప విషయం అన్నట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనవసరంగా సినిమాను అక్కడ విడుదల చేశారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి పుష్ప సినిమా తో రష్యా వరకు వెళ్లిన అల్లు అర్జున్ మరియు సుకుమార్ ముందు ముందు మరింత సక్సెస్ లను దక్కించుకొని ఈసారి అక్కడ సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు మరియు అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా చిత్రీకరణ జరుగుతోంది.సుకుమార్ మరియు అల్లు అర్జున్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి మరి వర్క్ చేస్తున్నారంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు చెప్తున్నారు.

దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందిస్తున్నారని 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేశాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు