ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌... అల్లు అర్జున్‌, సందీప్‌ సినిమా డేట్లు ఖరారు

అల్లు అర్జున్‌( Allu Arjun ) ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ని చేస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాలున్న పుష్ప 2 సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు షూటింగ్‌ ని పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

వచ్చే ఏడాది ఆగస్టు లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ అధికారికంగా ప్రకటించాడు. పుష్ప కి జాతీయ అవార్డ్‌ వచ్చిన నేపథ్యం లో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

కేవలం పుష్ప విషయం లోనే కాకుండా బన్నీ బాబు నటిస్తున్న నటించబోతున్న అన్ని సినిమా లపై కూడా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీ గా ఉన్నాయి.

Allu Arjun And Sandeep Vanga Movie Shooting Start Date , Allu Arjun , Sandeep V

కనుక ముందు ముందు బన్నీ నుంచి రాబోతున్న దాదాపు అన్ని సినిమా లు హిందీ బాక్సాఫీస్ వద్ద మినిమంగా వంద కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో అల్లు అర్జున్‌ తదుపరి సినిమా గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్ వంగ ( Sandeep vanga )తో బన్నీ సినిమా కన్ఫర్మ్‌ అయింది.

Advertisement
Allu Arjun And Sandeep Vanga Movie Shooting Start Date , Allu Arjun , Sandeep V

ఆ సినిమా కి సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలను 2024 జనవరి లో ప్రారంభించబోతున్నారట.

Allu Arjun And Sandeep Vanga Movie Shooting Start Date , Allu Arjun , Sandeep V

ఇంకా ఆసక్తికర విషయం ఏంటి అంటే 2025 లో వీరి కాంబో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయట.ఇక సందీప్ వంగ ( Sandeep vanga )సినిమా తర్వాత మాత్రమే అల్లు అర్జున్‌ తన తదుపరి సినిమా ను త్రివిక్రమ్‌ దర్శకత్వం లో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు.ముందు ముందు భారీ అంచనాల నడుమ బన్నీ సినిమా లు విడుదల అవ్వబోతున్నాయి.

వందల కోట్లు దాటి వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా బన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి అంటున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు