ఆ రెండు సినిమాల ఫలితాలు తలకిందులు అయితే బన్నీ అంత రిస్క్‌ తీసుకుంటాడా?

అల్లు అర్జున్ హీరో గా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం లో ఒక సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది.

హిందీ మరియు తెలుగు లో రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్రకటన రావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అందుకు కారణం ఈ సినిమా 2025 లో ప్రారంభం కాబోతుందట.ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది.

అలాంటిది ఇప్పుడే ఎందుకు ప్రకటించారు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.మరో వైపు ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి సినిమా తో తప్పితే మరే సినిమా తో కూడా సందీప్ వంగా సక్సెస్ సొంతం చేసుకోలేదు.

అర్జున్ రెడ్డి తెలుగు లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అలాగే అర్జున్ రెడ్డి యొక్క రీమేక్ హిందీ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement
Allu Arjun And Sandeep Vanga Movie Interesting Rumors , Allu Arjun , Sandeep Va

అంతకు మించి సందీప్ రెడ్డి వంగ భారీ విజయాలను నమోదు చేసిందేమీ లేదు.

Allu Arjun And Sandeep Vanga Movie Interesting Rumors , Allu Arjun , Sandeep Va

ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా చిత్రీకరణ దశ లో ఉంది.ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఒక సినిమా ను చేయబోతున్నాడు.

ఆ సినిమా కు స్పిరిట్ అనే టైటిల్ ని ఖరారు చేయడం జరిగింది.ఈ సంవత్సరం లో యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా వచ్చే ఏడాది స్పిరిట్ సినిమా ను చిత్రీకరించబోతున్నాడు.

Allu Arjun And Sandeep Vanga Movie Interesting Rumors , Allu Arjun , Sandeep Va

.ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో అనేది క్లారిటీ లేదు.ఒకవేళ యానిమల్ మరియు స్పిరిట్ సినిమా లు నిరాశ పరిచితే అల్లు అర్జున్ ధైర్యంగా సందీప్ రెడ్డి వంగ తో తన సినిమా ను చేస్తాడా అనేది చూడాలి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే కచ్చితంగా అల్లు అర్జున్ వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ అంతటి సాహసం చేస్తాడా లేదా అనేది చూడాలంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు