అల్లు ఫ్యామిలీకి కాసులు కురిపిస్తున్న కాంతారా.. లాభాలే లాభాలు!

తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమా కాంతారా.

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

చిన్న సినిమాగా మొదలై ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర 58 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.ఈ సినిమా పరుగులు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.100 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తుంది.ఇక కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయినా ఈ సినిమా పై అన్ని ఇండస్ట్రీల కన్ను పడింది.

దీంతో అక్కడ హిట్ అయినవెంటనే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి వదిలారు.తెలుగులో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రాబడుతున్న వసూళ్లు చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే.ముందుగానే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసిన అల్లు అరవింద్ ఈ సినిమా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఆక్యుపెన్సీ మరింత పెంచడానికి ప్లాన్ చేసున్నారు.

Advertisement

అల్లు అరవింద్ ఈ సినిమాను కేవలం 3 కోట్లకే సొంతం చేసుకుని తెలుగు వర్షన్ రిలీజ్ చేసాడట.మరి 3 కోట్లు అంటే చాలా తక్కువ అనే చెప్పాలి.ఇది కన్నడ లో సూపర్ హిట్ అయ్యి వార్తల్లో నిలవడంతో తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

దీంతో అల్లు అరవింద్ కు 3 కోట్లు ఈజీగా వచ్చేశాయని ఎప్పుడో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది అని తెలుస్తుంది.మరి ఈ సినిమా లాంగ్ రన్ ముగిసే సమయానికి భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

దీంతో అల్లు ఫ్యామిలీకి కాసుల పంట పండడం ఖాయం.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement