ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ( TDP ) చరిత్ర సృష్టిస్తోంది.రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 133 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
కూటమిలోని జనసేన( Janasena ) పోటీ చేసిన 21 స్థానాల్లోనూ లీడ్ లో ఉండగా.బీజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది.టీడీపీ చరిత్రలో ఇది అతి పెద్ద విజయంగా నిలిచింది.
కాగా వైసీపీ 13 స్థానాల్లో లీడ్ లో ఉండగా.ఎనిమిది జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు.
కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, నెల్లూరు, అనంతపురం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది.మరోవైపు టీడీపీ విజయపథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఫ్యామిలీ ( Chandrababu Family )ఆనందంలో మునిగిపోయింది.
ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.