రాబోయే అయిదేళ్ల వరకు ఆలియా తెలుగు లో నటించేదే లేదు అంటోంది

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్( Heroine Alia bhatt ) మరోసారి తెలుగు సినిమా ను తిరష్కరించినట్లుగా తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమా( RRR movie ) తో ఆలియా భట్‌ తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

 Alia Bhatt Not Commit For Telugu Films Next 5 Years Details, Alia Bhatt In Rrr M-TeluguStop.com

ఆ సినిమా లో ఈమె పాత్ర గురించి చాలా ప్రచారం చేశారు.సినిమా కథ మొత్తం ఆమె పాత్ర మీదే ఉంటుందని అన్నారు.

కానీ సినిమా లో ఆమె పాత్ర ఒక సెట్‌ ప్రాపర్టీ అన్నట్లుగా మారిపోయింది.మరీ దారుణంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ను తీసుకు వచ్చి ఇలా చేశారు ఏంటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన వారు చాలా మంది ఉన్నారు.

బాలీవుడ్‌ లో ఆలియా భట్ చేసిన సినిమా లకు ఆర్ ఆర్‌ ఆర్ సినిమా లో ఆమె పాత్రకు ఏమాత్రం పొంతన లేదు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.అలాంటి అసంతృప్తిని ఆమెకు కలిగించింది.

ఆమెను అసంతృప్తి నుండి బయట పడేసేందుకు గాను రాజమౌళి ఆమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను( Brahmastra movie ) తెలుగు లో విడుదల చేయడం జరిగింది.

Telugu Aliabhat, Alia Bhatt, Alia Bhatt Rrr, Aliabhatt, Brahmastra, Rajamouli, R

అందుకే బాలీవుడ్‌ లో ఆమె ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది.కానీ ఇప్పటి వరకు సౌత్‌ లో కానీ ఇతర భాషల సినిమా ల్లో కానీ ఆలియా భట్ నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.తెలుగు లో ఈమె నటించేందుకు మరో అయిదు సంవత్సరాలు ఆగాలేమో అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ యొక్క చేదు అనుభవం మొత్తం పోవాలి అంటే వెంటనే సాధ్యం కాదు.కనుక వెంటనే ఆమె తెలుగు లో నటించేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అంటున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ మరోసారి తెలుగు లో నటించి తనను తాను తగ్గించుకోవద్దని భావిస్తుంది అంటూ బాలీవుడ్‌ మీడియా లో కథనాలు వస్తున్నాయి.ముందు ముందు అయినా సౌత్‌ లో ఆలియా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వారి కోరిక తీరేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube