ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో గాడ్ ఫాదర్ ఫేమ్ అల్ పాసినో( Al Pacino ) 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా వినిపిస్తూనే ఉంది.
అయితే ఈ వయసులో తను తండ్రిగా ప్రమోషన్ పొందడాన్ని నమ్మలేకపోయాడట.తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా? అని ఆలోచనలో పడ్డాడట.ఈ క్రమంలో తన ప్రియురాలు నూర్ అల్ఫల్లా( Noor Alfallah ) గర్భం దాల్చడంపై అనుమానం వ్యక్తం చేశాడట.తన కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్‌ఏ డెస్ట్( DNA Test ) చేయాల్సిందేనని పట్టుబట్టాడట.

దాంతో భర్త అనుమానం తీర్చడం కోసం నూర్ కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా ఆ రిపోర్టులో అల్ పాసినోయే తండ్రి అని వెల్లడైనట్లు తెలుస్తోంది.అంటే ఈ హాలీవుడ్ స్టార్ 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారు.కానీ అతడి ప్రియురాలు నూర్ అల్ఫల్లా మాత్రం మొదటిసారి తల్లి కాబోతోంది.కాగా అల్ పాసినో గతంలో మీటల్ దోహన్, జాన్ టరంట్, బెవెర్లీ డీఆంగెలోతో రిలేషన్స్ కొనసాగించాడు.
ఈ క్రమంలో జాన్ టరంట్‌కు జూలీ మేరీ అనే కుమార్తె, బెవెర్లీ డీఆంగెలె కవలలకు జన్మనిచ్చింది.

అయితే వీరిద్దరికీ బ్రేకప్ చెప్పిన తర్వాత అల్ పాసినో కోవిడ్ సమయంలో నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు.అప్పటినుంచి వీరు సహజీవనం చేస్తున్నారు.అల్ఫల్లా కూడా గతంలో రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేయగా 2018లో బ్రేకప్ చెప్పింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు హీరో పై నెటిజన్స్ మండిపడుతున్నారు.ఈ వయసులో అవసరమా తండ్రి అవ్వడమే పెద్ద తప్పు మళ్ళీ దానికి డీఎన్ఏ టెస్టు అవసరమా అంటూ మండిపడుతున్నారు.
ముసలోనికి దసరా పండుగ అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
