నాగార్జునకి ఆ హీరోయిన్ ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న అక్కినేని నాగేశ్వరరావు.. కానీ..!!

స్టార్ హీరోయిన్ నాగార్జున( Nagarjuna ) ఇప్పటికి కూడా అమ్మాయిల కలల రాకుమారుడు గానే ఉన్నారు.ఆరుపదుల వయసు ఉన్నా కూడా తరగని అందంతో యంగ్ హీరోలలాగా చాలా యాక్టివ్ గా ఉంటారు.

 Akkineni Nageswara Rao Wanted To Marry That Heroine To Nagarjuna , Nagarjuna ,-TeluguStop.com

మరీ ముఖ్యంగా తన కొడుకుల కంటే తానే ఇప్పటికీ యంగ్ హీరోలా యాక్టింగ్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అలాంటి నాగార్జున ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక నాగార్జున తన జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది కేవలం మొదట దగ్గుబాటి లక్ష్మి ని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వడమే.అంతేకాదు ఆ తర్వాత నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) కి ఇష్టం లేకున్నా కూడా అమలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Telugu Amala, Sumalatha, Marraige, Nagarjuna, Tollywood-Movie

ఇక ఈ ఒక్క విషయం తప్ప నాగర్జున ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు.అయితే అలాంటి నాగార్జునకి దగ్గుబాటి లక్ష్మీ( Daggubati Lakshmi ) , అమల కంటే ముందే మరో హీరోయిన్ ని ఇచ్చి నాగేశ్వరరావు పెళ్లి చేయాలని అనుకున్నారట.మరి ఆ హీరోయిన్ ఎవరు.ఎందుకు వీరి పెళ్లి జరగలేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Amala, Sumalatha, Marraige, Nagarjuna, Tollywood-Movie

అక్కినేని నాగేశ్వరావు సినిమాల్లో నటించే టైంలో తన కొడుకు నాగార్జున విదేశాల్లో చదువుకుంటున్నారు.ఇక ఓసారి షూటింగ్లో ఉన్నప్పుడు హీరోయిన్ సుమలత( Sumalatha ) దగ్గరికి వెళ్లి నువ్వు చాలా అందంగా తెలుగింటి అమ్మాయి లాగా ఉన్నావు.నీకు తగ్గ ఈడు జోడు విదేశాల్లో ఉన్నాడు.మా అబ్బాయి నీ హైట్ కి వెయిట్ కి కరెక్ట్ గా సెట్ అవుతారు.నా కొడుకు నాగార్జున ని పెళ్లి చేసుకుంటావా అని అక్కినేని నాగేశ్వరరావు అడిగారట.దాంతో సుమలతకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్లిపోయిందట.

ఇక నాగార్జున విదేశాల నుండి తిరిగి ఇండియాకి రావడం, దగ్గుబాటి లక్ష్మితో పెళ్లి విడాకులు మళ్లీ అమల ( Amala ) ని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చకచగా జరిగిపోయాయి.అయితే నాగార్జున ని నాగేశ్వరరావు పెళ్లి చేసుకోమన్నారు అనే విషయాన్ని స్వయంగా హీరోయిన్ సుమలతనే గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube