నష్టాల బాటలో అఖిల్ మూవీ..?

అక్కినేని అఖిల్ "అఖిల్- ది పవర్ ఆఫ్ జువా" బాక్సాఫీస్ తంటాలు మొదటి రోజే మొదలయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 800 వందల థియేటర్లలో విడుదలైన అఖిల్, మొదటి రోజు బాగానే మొదలుపెట్టినా, అనుకున్నంత రేంజ్ లో లేదనే చెప్పాలి.

ఉన్న స్క్రీన్స్ కి, పెట్టిన రేట్స్ కి, వస్తున్నా షేర్స్ కి బ్యాలెన్స్ సరిపోవట్లేదు.మొదటి రోజు టాప్-10 ఓపెనర్స్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తున్నా, ఇంత తక్కువ ఎవరు ఊహించలేదు.

కథాబలం లేకపోవడం అఖిల్ ను దారుణంగా దెబ్బతీసింది.నిన్న చాలా చోట్ల ఉదయం ఆటలు 60% నుంచి 75% ఆకుప్యేన్సీ ఉండటం శోచనీయం.

హిట్ టాక్ కుడా లేకపోవడంతో ఈ రోజు అఖిల్ నడక నత్త నడకే అంటున్నారు ట్రేడ్ పండితులు.నాగార్జున కొడుకుని చూద్దాం అని జనాల్లో ఉండే ఆసక్తే సినిమాకు వచ్చే నష్టాల్ని తగ్గించాలి అంటున్నారు.

Advertisement

ఇక తోలి రోజు అంచనాల ప్రకారం 8-9 కోట్లు వరకు తెలుగు రాష్ట్రాలలో వసూళ్ళు వచ్చాయని, వరల్డ్ వైడ్ గా 10-11 కోట్ల షేర్ వరకు అఖిల్ కలెక్ట్ చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.ఇక మొదటి రోజు కలెక్షన్లు మధ్యాహ్నం వరకు ట్రాక్ అవుతాయి.

సోమవారం నాటికి అఖిల్ కు వచ్చే నష్టాల మీద ఒక అంచనాకు రావొచ్చు.

Advertisement

తాజా వార్తలు