టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఏజెంట్..!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.

అఖిల్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.మరి ఈ సినిమా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం విదితమే.కానీ గత ఏడాది నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

దీంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.అందుకే ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా ఆ సూచనలు అయితే లేవు.

Advertisement

ఇక ఈ సినిమా నుండి అప్డేట్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు చిన్న చిన్న పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న కూడా ఫ్యాన్స్ కు అవి సరిపోవడం లేదు.

అందుకే పెద్ద అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు నిన్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు కూడా పెరుగుతూ పోతున్నాయి.

ఇక ఇప్పుడు వచ్చిన టీజర్ అయితే మరిన్ని అంచనాలను పెంచేసింది అనే చెప్పాలి.ఈ టీజర్ రిలీజ్ అయినా 13 గంటల్లోనే ఏకంగా 76 లక్షల వ్యూస్ తో 4 లక్షల లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.మరి టైర్ 2 హీరోల సినిమాలకు ఈ రేంజ్ రెస్పాన్స్ అనేది ఎక్కువ అనే చెప్పాలి.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

దీంతో ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

https://youtu.be/DsdT3D_zKF0