యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అఖిల్ ఈ సినిమాతో మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమా తప్పకుండ మ్యాజిక్ క్రియేట్ చేసి సూపర్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈయన ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగలడు.
అలాంటిది ఈసారి సురేందర్ రెడ్డి మరింత గ్రాండ్ గా భారీ బుడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో మంచి హిట్ అవుతుంది అని ధీమాగా ఉన్నారు.చూడాలి ఈ సినిమా అఖిల్ కెరీర్ కు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో.

ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముటి విలన్ గా నటిస్తుండడంతో మరింత హైప్ ఏర్పడింది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పథకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు హిప్ హిప్ తమిజా సంగీతం అందిస్తుండగా సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది.







