యూవీ క్రియేషన్స్ వారి అతి పెద్ద సాహసం.. అఖిల్‌ కోసం అంతనా?

అఖిల్ సినీ కెరియర్ ప్రస్తుతం ఏ మాత్రం బాగాలేదని చెప్పాలి.80 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ ( Agent )సినిమా కనీసం పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా రాబట్ట లేక పోయింది.ఏజెంట్ సినిమా ఫలితం తర్వాత అఖిల్( Akhil akkineni ) సినిమాల ఎంపిక కచ్చితంగా బావుంటుందని అంతా భావించారు. అక్కినేని అభిమానులు అంతా కూడా అఖిల్ తదుపరి సినిమా తప్పకుండా బాగుండేలా ప్లాన్ చేస్తాడు అని భావిస్తున్నారు.

 Akhil Akkineni And Uv Creation Movie Budget , Akhil Akkineni  , Uv Creation , Bu-TeluguStop.com

కానీ అఖిల్ తదుపరి సినిమా విషయంలో చాలా మంది సినీ ప్రేమికులు ఏ మాత్రం నమ్మకంగా లేరు.కొందరు అసలు ఆసక్తి ని కనబరచడం లేదు.ఇలాంటి సమయంలో యూవీ క్రియేషన్స్ వారు అఖిల్ అక్కినేని తో భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా కోసం భారీగా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.అఖిల్ మార్కెట్ రూ.30 కోట్ల కు మించి లేదు అనే విషయం ఏజెంట్ సినిమా తో నిరూపితం అయింది.అందుకే అఖిల్ తో సినిమా నిర్మించాలంటే 25 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో సినిమా ను నిర్మిస్తే బాగుంటుంది.

అంతకు మించి ఖర్చు చేస్తే కచ్చితంగా అది ఓవర్ అవుతుంది.కనుక అఖిల్ తో యూవీ క్రియేషన్స్( UV creation ) వారు కూడా ఆ బడ్జెట్ లోనే సినిమా రూపొందిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యువీ క్రియేషన్స్ వారు అఖిల్ సినిమా కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు కానీ ఏజెంట్ సినిమా నిర్మాత మాదిరిగానే యువీ క్రియేషన్స్ వారు అఖిల్ సినిమా వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సినీ మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube