అఫిషియల్.. అఖండ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది...ఎప్పుడంటే ?

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే వీరి కాంబోలో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు వీరిద్దరి కన్ను హ్యాట్రిక్ హిట్ మీద పడింది.

ఈ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసి ఇద్దరు మళ్ళీ ఫామ్ లోకి రావాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement
Balakrishna Akhanda Movie First Single Coming Soon, Boyapati Srinu, Akhanda Movi

ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించ బోతున్నాడు.ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మొన్నటి వరకు కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఈ మధ్యనే రీస్టార్ట్ చేసి షూట్ కూడా కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్.

Balakrishna Akhanda Movie First Single Coming Soon, Boyapati Srinu, Akhanda Movi

త్వరలోనే సినిమా ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి మొదటి సింగిల్ రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

Balakrishna Akhanda Movie First Single Coming Soon, Boyapati Srinu, Akhanda Movi

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుందని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు.అతి త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం అని థమన్ చెప్పడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.ఈ మధ్య థమన్ చేసే అన్ని ఆల్బంస్ సూపర్ హిట్ అవుతుండడంతో ఈ సినిమా ఆల్బమ్ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

మరి చూడాలి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో.

Advertisement

తాజా వార్తలు