మా నాన్న జీవించి ఉంటే బాగుండేది.. హీరో అజిత్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు నటుడు అజిత్ కుమార్( Ajith Kumar ) గురించి మనందరికీ తెలిసిందే.

సినీ పరిశ్రమకు ఎన్నో సేవలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్ కుమార్.

ఇకపోతే సినీ పరిశ్రమకు చేసిన సేవలకు అజిత్‌ కుమార్‌ను కేంద్రం దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే.ఆయనను పద్మభూషణ్‌ తో( Padma Bhushan ) సత్కరించింది.

దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు.పద్మభూషణ్‌ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాము.

Ajith Kumar Response About Padma Bhushan Honour Details, Ajith Kumar, Padma Bhus

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు.ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నాను.

Advertisement
Ajith Kumar Response About Padma Bhushan Honour Details, Ajith Kumar, Padma Bhus

సినీ పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు.వారందరికీ ధన్యవాదాలు.

వారందరి ప్రేరణ, సహకారం, మద్దతు కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను.ఎన్నో ఏళ్లుగా రేసింగ్‌, షూటింగ్‌ లో నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు.

ఈ రోజును చూసేందుకు నా తండ్రి( Ajith Father ) జీవించి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తోంది.

Ajith Kumar Response About Padma Bhushan Honour Details, Ajith Kumar, Padma Bhus

నన్ను చూసి ఆయన గర్వపడేవాడు.భౌతికంగా మా మధ్య లేకపోయినా నేటికి ఆయన నాతోనే ఉన్నాడని అనుకుంటున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు అజిత్ కుమార్.అలాగే మరో ట్వీట్ 25 ఏళ్ల నుంచి నా భార్య షాలిని( Shalini ) సహకారంతోనే ఇలా ఉన్నాను.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

నా విజయానికి, సంతోషానికి ఆమె ప్రధాన కారణం.చివరగా నా అభిమానుల గురించి చెప్పాలి.మీ అంచంచలమైన ప్రేమ, మద్దతు కారణంగానే నేను అంకితభావంతో పనిచేయగలుగుతున్నాను.

Advertisement

ఈ అవార్డు మీ అందరిది.మీ అందరికీ వినోదాన్ని అందించడానికి ఇలానే కష్టపడతాను అని ఆనందం వ్యక్తం చేశారు అజిత్.

ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంత పెద్ద అవార్డు ఆయనకు రావడం పట్ల అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజా వార్తలు