తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను ఆదుకున్న అజింక్య రహనే, శార్దూల్ ఠాగూర్..!

డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆల్ అవుట్ అయింది.అయితే భారత బ్యాటర్లు పరుగులు చేయకుండానే తొందరగా పెవిలియన్ చేరటంతో జట్టును పీకల్లోతు కష్టాల్లో పడేశారు.151 పరుగులకే భారత్ 5 వికెట్లను కోల్పోయింది.ఆ తర్వాత అజింక్య రహానే( Ajinkya Rahane ), శార్థూల్ ఠాగూర్ లు అర్థ సెంచరీ తో భారత జట్టును ఆదుకున్నారు.అయినా కూడా భారత జట్టు 300 మార్కు దాటలేకపోయింది.

 Ajinkya Rahane And Shardul Thakur Helped India In The First Innings..!, Shardul-TeluguStop.com

తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 173 పరుగుల ఆధిక్యం లో ఉంది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పూజారా, శుబ్ మన్ గిల్ చాలా తీవ్రంగా నిరాశపరిచారు.

ఇక రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) 51 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ తో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఆ తర్వాత శ్రీకర్ భరత్ 15 బంతుల్లో ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అజింక్య రహానే 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 89 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను ఆదుకున్నాడు.శార్థూల్ ఠాకూర్ 109 బంతుల్లో 6 ఫోర్ లతో 51 పరుగులు చేశాడు.వీరిద్దరూ మరి కాసేపు క్రీజులో ఉండి ఉంటే భారత్ తొలి ఇన్నింగ్స్ లో స్కోరు 300 మార్క్ దాటి ఉండేది.

ఆ తరువాత వచ్చిన మహమ్మద్ షమీ 11 బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి 13 పరుగులు చేశాడు.దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసే నాటికి భారత్ 296 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది.భారత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు అధిక పరుగులు చేయకుండా కట్టడి చేయాలి.

ఆ తర్వాత భారత బ్యాటర్లు కాస్త అద్భుత ఆటను ప్రదర్శిస్తేనే టైటిల్ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube