ఇక నుంచి ట్రైన్స్ లో కూడా ఎయిర్ హోస్టెస్!

ట్రైన్స్ లో ఎయిర్ హోస్టెస్ ఏంటి అని అనుకుంటున్నారా.

నిజంగా మీరు విన్నది నిజమే,విమానాల్లోనే ఉండే ఈ ఎయిర్ హోస్టెస్ సదుపాయం ఇక నుంచి ట్రైన్ ప్యాసింజర్ల కు అందించాలని భావిస్తోంది ఇండియా రైల్వేస్.

దీని కోసం ఒక పైలెట్ ప్రాజెక్టు ను కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది.వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ స్టీవార్డ్స్ సర్వీసులు అందిస్తోంది.34 మంది ఎయిర్‌ హోస్టెస్ ఫ్లైట్ స్టీవార్డ్స్‌ను వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌లో నియమించింది.ప్రాజెక్ట్ నేపథ్యంలో వీళ్లు ఆరు నెలలు ప్యాసింజర్లకు సేవలు అందించనున్నారు.

ఒకేవేళ ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే మాత్రం ఇండియన్ రైల్వేస్ ఈ సేవలు ఇతర ప్రీమియం ట్రైన్లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది.ఐఆర్‌సీటీసీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.

ప్యాసింజర్లకు సుప్రీమ్ సర్వీసులు అందించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రయత్నిస్తోందన్నారు.

Advertisement

ట్రైన్‌లో ఎయిర్ హోస్టెస్‌, ఫ్లైట్ స్టీవార్డ్‌లకు నెలకు రూ.25,000 అందిస్తున్నట్లు తెలిపారు.మరైతే ఇక ట్రైన్స్ లో కూడా త్వరలో ఎయిర్ హోస్టెస్ లను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆడ వారి క్రికెట్ కు మగవారి క్రికెట్ కు మ‌ధ్య ‌ ఉండే ముఖ్యమైన 5 తేడాలు!
Advertisement